Blood Clot Signs & Symptoms: రక్తం గడ్డకట్టే ముందే శరీరంలో ఈ చిన్న చిన్న వ్యాధులు వస్తాయి..జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదమే..
Blood Clot Signs & Symptoms: చాలామందిలో ఈ క్రింది లక్షణాలున్న వారే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే రక్తం గడ్డ కట్టడం చాలామందిలో ఈ సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని సకాలంలో గుర్తించి వైద్యులను సంప్రదించడం చాలా మంచిది.
Blood Clot Signs & Symptoms: శరీరంలో రక్తం గడ్డ కట్టడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చాయి అవకాశాలు ఉన్నాయి. గడ్డ కట్టే ప్రక్రియనే వైద్య భాషలో థ్రాంబోసిస్ అని అంటారు. కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డ కట్టడం చాలా మంచిది. ఏదైనా గాయం జరిగిన క్రమంలో రక్తం గడ్డ కట్టడం చాలా మంచిది. లేకపోతే శరీరంలోని రక్తం మొత్తం గాయం ద్వారా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే శరీరంలోని చీరల లోపల రక్తస్రావం జరిగినప్పుడు అది తీవ్ర ప్రమాదకరంగా మారొచ్చు. కొంతమందిలో ఇలా రక్తస్రావం జరిగినప్పుడు గుండెపోటు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలా రక్తస్రావం జరగకుండా తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. రక్తం గడ్డ కట్టే ముందు శరీరంపై పలు లక్షణాలు ఏర్పడతాయి. సిరల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల శరీరంపై ఎలాంటి లక్షణాలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తం గడ్డకట్టే ముందు వచ్చే లక్షణాలు:
చర్మం రంగులో మార్పు :
సిరల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల చర్మం రంగు చర్మం రంగు మారే అవకాశాలు ఉన్నాయి. రక్తం గడ్డ కట్టడం వల్ల నరాల బలహీనత నరాలు దెబ్బ తినడం వంటి సమస్యలు కూడా వస్తాయి. దీంతో చర్మంలో రంగులో మార్పులు సంభవించి తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
వాపు:
రక్తం గడ్డకట్టడం వల్ల మీ శరీరంలో రక్త ప్రవాహానికి అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా చేతి పై గడ్డల్లా ఉబ్బడం, నొప్పులు గాయాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారు తప్పకుండా వైద్యులను సంప్రదిస్తే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఇది ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
తీవ్రమైన ఛాతి నొప్పి :
సిరల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల తీవ్రమైన ఛాతి నొప్పులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొందరిలోనైతే గుండెపోటు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలామందిలో చాతి నొప్పి రావడానికి ప్రధాన కారణాలు రక్తం గడ్డ కట్టడమేనని ఇటీవలే పలు నివేదికలు పేర్కొన్నాయి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది:
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే అది ముమ్మాటికి సిరల్లో రక్తం గడ్డ కట్టడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా రక్తం గడ్డ కట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా మంచిది.
Also Read: Chamika Karunaratne: అయ్యో కరుణరత్నే.. క్యాచ్ కోసం మూతి పళ్లు రాళగొట్టుకున్నాడు.. వీడియో వైరల్
Also Read: PM Kisan Yojana: పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు షాక్.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి