Boiled Groundnuts Health Benefits: పల్లీలు ఉడకబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా పల్లీలను చాలామంది నేరుగా తింటారు. కొన్ని వేయించి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే, ఉడకబెట్టి పల్లీలు తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోషకాలు పుష్కలం..
ఉడకబెట్టిన పల్లీలు తింటే ఎన్నో పోషకాలు లభిస్తాయి. ఇందులో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటుంది. ఈ మినరల్స్ ఆరోగ్యకరంగా కీలకపాత్ర పోషిస్తాయి.


గుండె ఆరోగ్యం..
పల్లీల్లో మోనోసాచురేటేడ్, పాలీఅన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఆరోగ్యకరమైన కోవ్వులు బ్యాడ్‌ కొలెస్ట్రాల్ తక్కువవుతాయి. దీంతో కార్డియోవాస్క్యూలర్ సమస్యలను నివారిస్తాయి. గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ పల్లీలను సమయానికి గుప్పెడు తినండి.


యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు..
పల్లీలు ఉడకబెట్టినవి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్ సమస్యను నివారిస్తాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ నుంచి కాపాడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.


ఇదీ చదవండి: పీచు పండు తింటే ఈ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. గర్భిణులకు సుఖప్రసవం ఖాయం


బరువు నిర్వహణ..
కేలరీలు ఉన్నా ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సమతుల ఆహారం. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారు పల్లీలు డైట్లో చేర్చుకోవాలి. బరువు పెరగకుండా ఉంటారు. ఉడకబెట్టిన పల్లీలు తింటే కడుపు ఎక్కువ సమయం నిండుగా ఉంటుంది.


బ్లడ్ షుగర్..
ఫైబర్ కంటెంట్‌ అధికంగా ఉండే బ్లడ్‌ షుగర్ లెవల్స్‌ నిర్వహిస్తుంది. రక్తంలో చక్కెర మెల్లగా గ్రహిస్తుంది.  డయాబెటిస్‌ సమస్య ఉన్నవారు ఇది బెస్ట్‌ ఆప్షన్. షుగర్ వ్యాధితో బాధపడేవారు పల్లీలను డైట్లో చేర్చుకోవాలి. ఇది వారికి ఎంతో ఆరోగ్యకరం. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే లో కేలరీలకు బ్లడ్‌ షుగర్ వ్యాధిగ్రస్థులకు మంచివి.


ఇదీ చదవండి: జామపండుతో 5 ఆరోగ్య ప్రయోజనాలు.. కేన్సర్‌కు చెక్‌


బ్రెయిన్ హెల్త్‌..
పల్లీల్లో పుష్కలంగా ఉంటాయి.ఇందులో ఫోలేట్‌, నియాసిన్‌ బ్రెయిన్ హెల్త్‌కు మంచిది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉడకబెట్టిన పల్లీలు డైట్లో చేర్చుకోవడం వల్ల మెదడు పనితీరుకు సహకరిస్తుంది. ఎంతో ఎఫెక్టివ్‌గా  పల్లీలు పనిచేస్తాయి. ఉడకబెట్టిన పల్లీల్లో పోషకాలు పుష్కలం. ఇది మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. వేయించిన పల్లీల కంటే ఉడకబెట్టిన పల్లీలు చేర్చుకోండి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter