Bone Health Diet: శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఎముకలు బలంగా ఉండటం చాలా అవసరం. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనమౌతుంటాయి. అయితే కొన్ని పదార్ధాలు తీసుకుంటే 60లో కూడా ఎముకలు బలంగా ఉంటాయి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మెరుగైన ఆరోగ్యం, బాడీ ఫిట్‌నెస్ చాలా అవసరం. ముఖ్యంగా ఎముకలు బలంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది. సాధారణంగా వయస్సు పెరిగేకొద్దీ శరీరంలోని ఎముకలు బలహీనమౌతుంటాయి. దీనికి కారణం కాల్షియం లోపం. అందుకే కాల్షియం తగినంతగా లభించే పదార్ధాలు తరచూ తీసుకోవాలి. దీనివల్ల ఎముకలు బలంగా మారతాయి. ఎముకల పటిష్టత కోసం ఏం తినాలో చూద్దాం..


నువ్వుల్లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు బలాన్నిస్తాయి. రోజూ వీటీని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. అంతేకాకుండా బాడీ పెయిన్స్ వంటివి దూరమౌతాయి. వీటిని ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు.


నట్స్, అంజీరలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజువారీ డైట్‌లో వీటిని చేర్చితే మంచి ఫలితాలుంటాయి. ఆకుకూరల్లో చాలా పోషక పదార్ధాలుంటాయి. వీటివల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి. తోటకూర, పాలకూరతో పాటు కాలిఫ్లవర్, బ్రోకలీ కూడా ఇందుకు దోహదపడతాయి.


ఇక బీన్స్ సేవించడం ఎముకలకు పటిష్టత ఇస్తుంది. బీన్స్‌లో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషక పదార్ధాలు మెండుగా ఉన్నాయి. బీన్స్‌ను మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే ఎముకలు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంటాయి. మీ వయస్సు 60కు చేరినా ఎముకల్లో పటుత్వం తగ్గదు.


Also read: Heart Disease: గుండెకు సంబంధించి ఈ లక్షణాలుంటే..నిర్లక్ష్యం చేయవద్దు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook