Brain Boosting Foods: వీటిని ప్రతి రోజూ తింటే జ్ఞాపకశక్తి 15 రోజుల్లో పెరగడం ఖాయం..
Brain Boosting Foods: ప్రస్తుతం చాలా మంది చిన్న వయసులోనే జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి ఈ కింది ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటిని ప్రతి రోజూ తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Brain Boosting Foods: వయసు పెరిగే కొద్దీ శరీరం, జ్ఞాపకశక్తి తరచుగా బలహీనపడటం ప్రారంభమవుతుంది. పలు అధ్యయనాల ప్రకారం.. జ్ఞాపకశక్తి కోల్పోతున్నవారిలో అధికంగా 50 నుంచి 60 సంవత్సరాల వారేనని పేర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే జ్ఞాపకశక్తి బలహీనపడిన వారు తప్పకుండా రోజూ తీసుకునే ఆహారంలో పలు రకాల ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవడం జ్ఞాపకశక్తి పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు:
>> క్యాబేజీ, ఉల్లిపాయ, బ్రకోలీ వంటి కూరగాయలలో ఫ్లేవనాయిడ్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడానికి సహాయపడతాయి.
>>పాలు, పెరుగు, కొవ్వు చేపలు, చిక్కుళ్ళు, బీన్స్, గుమ్మడి గింజలు, గోధుమలు, బార్లీ, ఓట్స్ వంటి ధాన్యాల్లో మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
>>జ్ఞాపకశక్తిని పెంచడానికి మొలకలు, బచ్చలికూర, క్యారెట్లు, చిలగడదుంప కూడా సహాయపడుతుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల కెరోటినాయిడ్లు శరీరానికి లభించి మెదడు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఆహారంలో పచ్చి కూరగాయలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.
>>గుడ్డు సొనలు, తృణధాన్యాలు, సోయాబీన్స్, నువ్వుల గింజలలో లెసిథిన్ అధికంగా లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతి రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
>>పాలలో కూడా విటమిన్ బి12 అధిక పరిమాణంలో లభ్యమవుతాయి. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు పాలను తాగాల్సి ఉంటుంది. అయితే ఇందులో ఉండే గుణాలు రోగనిరోధక శక్తికి పెంచి.. జ్ఞాపకశక్తిని కూడా పెంచేందుకు సహాయపడతాయి.
>>సిట్రస్ పండ్లలో కూడా జ్ఞాపకశక్తిని పెంచే చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తినడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : Aadhaar Card Important News: మీ ఆధార్ కార్డ్ లాక్ లేదా అన్‌లాక్ చేసుకోండిలా
ఇది కూడా చదవండి : Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook