How To Lock, Unlock Aadhaar Card: ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా.. లేదంటే ప్రభుత్వంతో ముడిపడిన ఏ పని చేసుకోవాలన్నా.. ప్రతీ ఒక్కరికీ ఆధార్ కార్డు తప్పనిసరి అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంక్ ఎకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకున్నా.. ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాలనుకున్నా.. లేదా చివరకు ఇంటికి నల్లా కనెక్షన్ తీసుకోవాలనుకున్నా.. పని ఏదయినా ఆధార్ కార్డ్ మాత్రం తప్పనిసరి.
ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ప్రభుత్వంతో ముడిపడిన ఏ లావాదేవీలు చేయాలన్నా ఆధార్ కార్డు డేటా ఇవ్వాల్సిందే. అయితే అందరికీ ఉండే ఒక భయం ఏంటంటే.. మనకే తెలియకుండా మన ఆధార్ కార్డు డేటా దుర్వినియోగం అయితే అప్పుడు మన పరిస్థితి ఏంటనే భయం చాలా మందిలో ఉంటుంది.
ఆధార్ వర్చువల్ ఐడి:
అలాంటప్పుడు మీరు ఎక్కడైనా ఆధార్ డీటేల్స్ ఇవ్వాల్సి వస్తే... మీ ఆధార్ కార్డుపై ఉన్న ఆధార్ నెంబర్ కాకుండా వర్చువల్ ఐడిని ఇవ్వవచ్చు. వర్చువల్ ఐడి ఆధారంగా ఆధార్ కార్డు నెంబర్ని ట్రేస్ చేయలేం కనుక ఆధార్ నెంబర్‌కి వచ్చే ముప్పు ఏమీ లేదు.
ఆధార్ అధికారిక వెబ్సైట్ లేదా మై ఆధార్ పోర్టల్‌లోకి లాగిన్ అవడం ద్వారా వర్చువల్ ఐడిని జనరేట్ చేసుకోవచ్చు.
ఆధార్ లాక్ సర్వీస్:
ఆధార్ కార్డ్ హోల్డర్స్ అందరికీ యుఐడిఏఐ ఆధార్ లాక్ సేవను అందిస్తుంది. దీంతో ఆధార్ కార్డుదారులు ఎవరైనా తమ బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకోవచ్చు. అవసరం అయినప్పుడు అన్‌లాక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ హోల్డర్స్ బయోమెట్రిక్ వివరాలను ఉపయోగించే ముందు స్వయంగా లాక్ చేసుకోవచ్చు లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు.
ఆధార్ కార్డు డీటేల్స్ లాక్ చేయడం, అన్‌లాక్ చేయడం ఎలా ?
స్టెప్ 1: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఏఐ) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
స్టెప్ 2: మై ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఆధార్ సర్వీసెస్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మీ బయోమెట్రిక్స్‌ని భద్రపర్చుకోండి.
స్టెప్ 4: ఆ తర్వాత, లాక్ / అన్‌లాక్ బయోమెట్రిక్స్పై క్లిక్ చేసి మీ ఆధార్ వివరాలను ఇవ్వడం ద్వారా తదుపరి ప్రక్రియను పూర్తి చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు మీ ఆధార్ డేటాను సులభంగా లాక్ చేయవచ్చు లేదా అన్‌లాక్ చేయవచ్చు.
ఆధార్ కార్డు హిస్టరీ:
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఏఐ) ఆధార్ కార్డు హిస్టరీని చెక్ చేసుకునే వెసులుబాటు కూడా అందిస్తోంది. ఆధార్ కార్డు హిస్టరీని తెలుసుకోవడం ద్వారా.. గత ఆరు నెలల్లో ఏయే డాక్యుమెంట్‌తో మీ ఆధార్ కార్డు లింక్ చేసి ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే.. గడిచిన ఆరు నెలల్లో మీరు మీ ఆధార్ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించుకున్నారో తెలుసుకోవచ్చన్నమాట.
ఇది కూడా చదవండి : Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి
ఇది కూడా చదవండి : Tata Safari Modification: ఇలాంటి కారును మీరెప్పుడూ చూసుండరు.. ఇదొక్కటే ఉంది
ఇది కూడా చదవండి : Tata Nexon SUV Prices: మారుతి, మహింద్రాలకు చమటలు పట్టిస్తున్న ఎస్యూవి.. జనం కళ్లు మూసుకుని కొంటున్న ఎస్యూవి కారు ఏదో తెలుసా ?
ఇది కూడా చదవండి : SBI Loans: గుడ్ న్యూస్.. ఏ సెక్యురిటీ లేకుండానే 10 లక్షల రుణం ఇస్తోన్న ఎస్బీఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook