COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Breakfast For Weight Loss And Belly Fat Loss In 7 Days: ప్రస్తుతం చాలా మంది ఊబకాయం కారణంగా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందిలో బెల్లీ ఫ్యాట్ సమస్యలు వస్తున్నాయి.  అయితే ఇలాంటి సమస్యలు రావడానికి కారణాలు మాతున్న జీవనశైలేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి అధిక బరువు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారపు అలవాట్లలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది.  లేకపోతే అనే రకాల దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే ఛాన్స్‌లు ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 


బరువు తగ్గడానికి చాలా మంది వర్కవుట్‌లను ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో పాటు కొంతమంది ప్రత్యేకమైన ఆహార డైట్‌లను అనుసరిస్తారు. వీటన్నింటిని అనుసరించినప్పటికీ బరువు తగ్గలేకపోతారు. అయితే బరువు తగ్గడానికి కొంతమంది ఆరోగ్య నిపుణులు పలు రకాల ఆహారాలను అల్పాహారంలో తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్‌ నుంచి కూడా సులభంగా ఉపశనం లభిస్తుంది. 


అల్పాహారంలో తప్పకుండా వీటిని తీసుకోండి:
స్మూతీస్:

బరువు తగ్గడానికి చాలా మంది ఎక్కువగా స్మూతీలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యంగా, సులభంగా బరువు తగ్గడానికి ప్రతి రోజు పండ్లు, గింజలు, కూరగాయలను స్మూతీలా తయారు చేసుకుని తాగాల్సి ఉంటుంది. 


ఉడకబెట్టిన గుడ్లు:
ఉడకబెట్టిన గుడ్లు ప్రతి రోజు ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పరిమాణంలో ప్రోటీన్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా వీటిని తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఉదయాన్నే ఉడకబెట్టిన గుడ్లను తగిన పరిమాణంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  


ఓట్ మీల్:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు అల్పాహారంలో ఓట్‌ మీల్‌ తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఓట్ మీల్‌లో భాగంగా పండ్లు, గింజలను కలిపి తీసుకోవడం వల్ల వేగంగా ఆరోగ్యంగా బరువు తగ్గే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


పండ్ల ముక్కలు:
బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఉదయం పూట ఆల్‌ ఫ్రూట్‌ మిక్స్‌ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి రోజంతా శక్తిని అందిస్తాయి. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి ప్రతి రోజు పండ్లను తీసుకుంటే మంచి లాభాలు పొందుతారు. 


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook