Breast Cancer Symptoms: క్యాన్సర్ సోకిన తరువాత క్యాన్సర్ సోకిన రకాన్నిబట్టి చికిత్స క్లిష్టంగా ఉంటుంది. అలా కాకుండా క్యాన్సర్ సోకడానికంటే ముందే క్యాన్సర్ కారకాలు, క్యాన్సర్ లక్షణాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా మిమ్మల్మి మీరు కాపాడుకోవడంతో పాటు మీ కుటుంబసభ్యుల్ని కూడా కాపాడుకోవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సర్వ సాధారణ వ్యాధిగా మారిపోయింది. ఇటీవల కాలంలో భారీగా బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతుండటమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 


క్యాన్సర్ వ్యాధి అనేది ఎంత త్వరగా డిటెక్ట్ చేస్తే.. ఆ డబ్బును నయం చేసుకోవడానికి అంత అవకాశాలు, చికిత్స అందుబాటులో ఉంటుంది. క్యాన్సర్ వ్యాధిని ఆలస్యంగా డిటెక్ట్ చేస్తే ఆ వ్యాధిని నయం అవడంలో అన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తుతాయి. ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి ? బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుని సమస్యలు తొలి దశలోనే గుర్తిస్తే.. ఆ వ్యాధిని నయం చేసుకునే అవకాశాలు కూడా అంతే ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


స్థూలకాయం, ఆల్కాహాల్‌కి అలవాటు పడటం, 24 గంటల్లో ఎక్కువ సమయం ఒకే చోట కూర్చుని బద్ధకంగా గడిపే లైఫ్ స్టైల్ వంటి సమస్యలే మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడటానికి కారణాల్లో ప్రధానమైనవిగా నిపుణులు గుర్తించారు.


బ్రెస్ట్ క్యాన్సర్.. దీనినే మనం తెలుగులో రొమ్ము క్యాన్సర్ అని కూడా పిలుస్తుంటాం. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలలో ముందుగా చెప్పుకోదగినది బ్రెస్ట్‌లో గడ్డ లేదా కణితిగా ఏదైనా గట్టిగా తయారవ్వడం. రొమ్ములో కానీ లేదా భుజాల కింది భాగంలో కానీ ఏదైనా గట్టిగా గడ్డలా వచ్చిందంటే దానిని నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య పరీక్షలు చేయించుకుని ఆ సమస్య ఏంటనేది నిర్ధారించుకోవాలి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలో ఇలా గడ్డ అవడం కూడా ఒకటి.


వక్షోజాల సైజులో తేడాలు రావడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలలో ఒకటి.


వక్షోజాలపై స్తనాల చుట్టూ చర్మం ఎర్రగా మారి, చర్మం పగలడం వంటి లక్షణాలు కనిపిస్తే లైట్ తీసుకోవద్దు.


వక్షోజాలు వాయడం, లేదా వక్షోజాలలో మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త వహించండి. 


వక్షోజాలలో లేదా స్తనాలలో ఏదైనా నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.


ఇది కూడా చదవండి : Eating Raisins During Pregnancy: గర్భధారణ సమయంలో ఎండుద్రాక్ష తినొచ్చా? తినడం వల్ల ఏం జరుగుతుందంటే..


వక్షోజాలు లేదా స్తనాల చుట్టూ అదే పనిగా దురదగా, నొప్పిగా అనిపించడం లేదా మంటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తే మీరు వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాల్సిందే.


అన్నింటికంటే ముఖ్యంగా స్తనాల నుంచి రక్తం కారడం కనిపిస్తే అస్సలే లైట్ తీసుకోవద్దు. ఇది ఒక హెచ్చరికగా భావించాల్సిందే.


ఇది కూడా చదవండి : Reduce High Cholesterol: చెడు కొలెస్ట్రాల్‌ను వెన్నలా కరిగించే అద్భుత ఇంటి చిట్కాలు..


(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించడానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి