మహిళలు ఈ లక్షణాలను గమనించారా..? అయితే మీరు గుండెపోటుకు గురవ్వనున్నారని అర్థం!

ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా ఆఫీసుల్లో విధులను నిర్వహిస్తున్నారు. అలాగే మహిళలు గుండెపోటుకు గురవ్వటం కూడా ఎక్కువ అయింది. మహిళల్లో గుండెపోటుకు గల కారణాలు.. బహిర్గతం అయ్యే లక్షణాలు ఇవే!

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 12:54 PM IST
మహిళలు ఈ లక్షణాలను గమనించారా..? అయితే మీరు గుండెపోటుకు గురవ్వనున్నారని అర్థం!

Heart Attack in Women: హార్ట్ అటాక్ విషయానికి వస్తే పురుషులతో పోలిస్తే మహిళల్లో భిన్నంగా ఉంటుంది. పురుషుల్లో కనిపించే గుండెపోటు లక్షణాల మహిళల్లో ఉండవు. పురుషుల్లో గుండెపోటు వలన కలిగే నొప్పు ఎక్కువగా ఉంటుంది కానీ మహిళలలో ఈ లక్షణాలు ఉండవు. అసలు మహిళల్లో గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో ఇపుడు తెలుసుకుందాం.. 

ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా మహిళలు గుండెపోటుకు ఎక్కువగా గురి అవుతున్నారు. ఒత్తిడికి గురయ్యే మహిళల్లో గుండెపోటు గురయ్యేరు అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఒత్తిడితో పాటు శారీరక వ్యాయామాలు లేకపోవటం కూడా ఒక కారణం. ఎక్కువగా నిరంతరంగా ఒక స్థానంలో కూర్చునే మహిళలు గుండెపోటుకు గురి అవుతున్నారు.  

మహిళల్లో గుండెపోటు కారణాలు: 
ప్రస్తుతం ఉన్న రోజుల్లో మహిళలు కూడా పురుషులకు సమానంగా ఆఫీసులకు వెళ్తున్నారు. ఫలితంగా ఎక్కువ సమయం పాటు కూర్చోవటం.. సరైన వ్యాయామాలు లేకపోవటం.. రోజులో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం మరియు ఆరోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండటం వలన మహిళలు గుండెపోటుకు గురవుతున్నారు. అదే సమయంలో, మహిళలకు చిన్న వయస్సులోనే మధుమేహం, థైరాయిడ్, డిప్రెషన్ వంటి తీవ్రమైన వ్యాధుల బారినపడుతున్నారు. ఇలా ఇతర వ్యాధుల వలన కూడా మహిళలు గుండెపోటుకు గురవుతున్నారు. 

ఏ వయసులో ఎక్కువ ప్రమాదం: 
మహిళలు ఆఫీసు పనుల్లో ఎంత బిజీగా ఉన్న కూడా యోగా, జిమ్, సైక్లింగ్ మరియు వాకింగ్ వంటి వ్యాయామాలు చేయడం ఎంతో ముఖ్యం.  ఎందుకంటే మహిళలు కూడా ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతున్నారు.ముఖ్యంగా, 65 ఏళ్ల మహిళల్లో గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

Also Read: Heavy Rains: ఏపీలో మూడ్రోజులపాటు వర్షాలు, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

మహిళల్లో గుండెపోటు లక్షణాలు  
1) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం
2) రెండు చేతుల్లో నొప్పి ఎక్కువగా ఉండడం
3) ఎక్కువగా చెమటలు పట్టడం
4) పని తక్కువ చేసిన ఊపిరి పీల్చుకోవడం మరియు తొందరగా అలసిపోవడం
5) మెట్లు ఎక్కేటప్పుడు శ్వాసలో ఇబ్బంది కలగడం
6) ఉదయం లేవగానే కళ్ళు తిరగడం లేదా రోజులో అప్పుడప్పుడు కళ్ళు తిరగడం
7) మెడ నుండి పొత్తికడుపు వరకు ఇబ్బందిగా ఉండడం

Also Read: Chandrababu: చంద్రబాబు అరెస్టును సవాలు చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News