Broccoli Protein Magic: వారంలో బ్రకోలీ ఒక్కసారైనా తింటే.. 100 ఏళ్లు బ్రతకడం ఖాయం!
Broccoli Protein Magic: బ్రకోలీలో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగించేందుకు సహాయపడుతుంది. అలాగే బరువు కూడా తగ్గుతారు.
Broccoli Protein Magic: బ్రకోలీలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ కె, విటమిన్ బి, ఫోలేట్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ బ్రకోలీ ఎంతగానో సహాయపడుతుంది. ప్రతి రోజు ఇది ఆహారాల్లో తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇవే కాకుండా శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
బ్రకోలీ తినడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు:
బ్రకోలీలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫోరాఫేన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి రోజు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే పెద్దప్రేగు, ఊపిరితిత్తులు, మూత్రపిండాల క్యాన్సర్లను నిరోధించడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది. అలాగే తీవ్ర అనారోగ్య సమస్యలు రాకుండా కూడా సహాయపడుతుంది.
గుండె సమస్యలు:
బ్రకోలీలో ఫైబర్, పొటాషియం, విటమిన్ కె అధిక పరిమాణంలో లభిస్తుంది.. ఇవి రక్తపోటును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా సహాయపడుతుంది. బ్రకోలీలో యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రపరచి, గుండె జబ్బులను నిరోధించేందుకు దోహదపడుతుంది.
ఎముకల ఆరోగ్యం:
బ్రకోలీలో విటమిన్ కె, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపున్నారు. అలాగే ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదాన్ని కూడా ఎంతగానో నివారిస్తుందట.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
బ్రకోలీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలను బ్రకోలీ నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
చర్మ ఆరోగ్యం:
బ్రకోలీలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన సలాడ్ రోజు తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా ముడతలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి.
బరువు తగ్గడానికి కీలక పాత్ర:
బ్రకోలీలో కేలరీలు అతి తక్కువ ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి రోజు దీనిని తినడం వల్ల శరీరానికి అధిక ఫైబర్ లభిస్తుంది. ఇది శరీర బరువును నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.