Calcium Rich Foods: ప్రొటీన్ తరహాలోనే  క్యాల్షియం కూడా దేహదారుడ్యానికి, ఎముకల పుష్టికి బాగా ఉపయోగపడుతుంది. ఎముకలతో పాటు దంతాలను బలిష్టంగా తయారు చేయడంలో క్యాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాదు.. క్యాల్షియం గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాల్షియం లోపం ఉంటే ఎముకలు బలహీనంగా మారుతాయి. దంతాలు కూడా బలహీనంగా తయారవుతాయి. న్యూరోమస్క్యులర్ సమస్యలతో పాటు గుండె జబ్బులకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. మరి ఈ క్యాల్షియం లోపాన్ని ఎలా అధిగమించాలి అనే కదా మీ సందేహం.. క్యాల్షియం కావాలి అంటే నిత్యం పాలు తాగే అలవాటు చేసుకోవాలి అని వాళ్లు, వీళ్లు చెప్పడం చాలాసార్లు వినే ఉంటారు. కానీ క్యాల్షియమే కావాలి అంటే అందుకు కేవలం పాలు మాత్రమే కాదు.. క్యాల్షియం పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలు ఇంకెన్నో ఉన్నాయి. అవేంటనేది ఇప్పుడు చూద్దాం. 


క్యాల్షియం పుష్కలంగా ఉన్న ఫుడ్స్ డీటేల్స్
కాటేజ్ చీజ్ :
పాలతో తయారు చేసిన పనీర్‌లో సోడియం, కాల్షియం, ప్రోటీన్, జింక్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. అందుకే పనీర్ తినడం వల్ల ఎముకలు బలంగా మారటమే కాకుండా బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌తో 42 శాతం కాల్షియం లభిస్తుంది. 


బాదాం :
బాదాం పప్పు చాలా ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. రోజూ ఒక పిడికెడు బాదం పలుకులు తింటే మీ ఒంటికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఒక 30 గ్రాముల బాదాం పప్పులో 76 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది అని న్యూట్రిషనల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతుంటారు. బాదాంలో కాల్షియంతో పాటు విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. రోజూ గుప్పెడు బాదం పలుకులు తింటే ఎముకలు దృఢంగా అవడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.  


పెరుగు :
పెరుగులోనూ క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఎముకలు ధృడంగా తయారు చేయడానికి పెరుగు దోహదపడుతుంది. జీర్ణవ్యవస్థను మెరుగు పర్చడంలోనూ పెరుగు ఎంతో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఒక కప్పు పెరుగు తింటే మీ శరీరానికి 300 మి.గ్రా వరకు కాల్షియం లభిస్తుంది.


సోయా పాలు :
కొంతమంది ఆవు పాలు లేదా గేదె పాలు తాగడానికి అంతగా ఇష్టపడరు. అలా పాలు తాగే అలవాటు లేకపోవడం వల్ల కూడా అలాంటి వారికి క్యాల్షియం లోపం ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే వాళ్లు సోయా పాలు తాగితే కాల్షియం లోపం రాకుండా ఉంటుంది. సోయా పాలలో కేవలం క్యాల్షియం మాత్రమే కాకుండా ప్రోటీన్, ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి సైతం సహాయపడుతుంది.


ఇది కూడా చదవండి : How To Lose Over Weight Without Exercises: జిమ్‌కి వెళ్లకుండా, ఎక్సర్‌సైజెస్ చేయకుండా అధిక బరువు తగ్గడం ఎలా ?


పచ్చని ఆకు కూరలు :
బచ్చలి ఆకు కూర, పాల కూర వంటి పచ్చటి ఆకు కూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. క్యాల్షియంతో పాటు పొటాషియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ క్యాల్షియం అధికంగా ఉండే పచ్చటి ఆకు కూరలు రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కండరాల నొప్పిని దూరం చేస్తాయి. 40 ఏళ్లు పైబడిన స్త్రీలలో క్యాల్షియం లోపాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. 


ఇది కూడా చదవండి : Uric Acids Patients: యూరిక్ యాసిడ్ పేషెంట్స్ ఇవి తింటే ఇక నొప్పులే ఉండవు


(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించానికి ముందు వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి