Uric Acids Patients: యూరిక్ యాసిడ్ నిరోధించే ఆకులు : యూరిక్ యాసిడ్ అంటే మరేదో కాదు.. మనిషి రక్తంలో నిల్వ ఉండే ఒక రకమైన మురికి పదార్థం పేరే ఈ యూరిక్ యాసిడ్. మన శరీరంలో ఉండే ప్యూరిన్ అనే ఒక రసాయనం విచ్ఛిన్నం అయినప్పుడు ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. అలా ఉత్పత్తి అయిన యూరిక్ యాసిడ్ రక్తంలో అధికం అవడం వల్ల కీళ్లలో స్ఫటికాల రూపంలో పేరుకుపోతుంది. ఇది కీళ్ల నొప్పి, వాపు, మంట వంటి సమస్యలకు దారితీస్తుంది. ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్లు ప్యూరిన్ అధిక మొత్తంలో ఉండే ఆహారానికి దూరంగా ఉండటంతో పాటుగా యూరిక్ యాసిడ్‌ను నియంత్రించే ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం కొన్ని రకాల ఆకులు బాగా ఉపయోగపడతాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
కొత్తిమీర ఆకులు :
శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి కాకుండా నియంత్రించడంలో కొత్తిమీర ఆకులు ఎంతో సహాయపడతాయి. కొత్తిమీర ఆకులను మిక్సీలో గ్రైండింగ్ చేసుకుని నీటిలో కలిపి తాగితే ప్రయోజనం ఉంటుంది.
కరివేపాకు :
కూరల్లో వేసుకునే కరివేపాకును చాలామంది చాలా లైట్ తీసుకుంటుంటారు. కానీ ఆరోగ్యానికి అది ఎంతో మేలు చేస్తుంది అనే విషయం అందరికీ తెలియదు. రక్తంలో యూరిక్ యాసిడ్ మొత్తాన్ని తగ్గించడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకు శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. కరివేపాకు రసం తాగినా లేదా నీళ్లో మిశ్రమంలా చేసి తాగినా అది పనిచేస్తుంది.
తమలపాకు ఆకులు :
యూరిక్ యాసిడ్ నియంత్రించడంలో తమలపాకులదే కూడా ముఖ్యమైన పాత్రే అనే విషయం మర్చిపోవద్దు. తమలపాకుల రసం మనిషి రక్తంలోని యూరిక్ యాసిడ్ స్ఫటికాలను బయటకు పంపిస్తుంది. ఈ తమలపాకులను అలాగే నమిలి కూడా మింగవచ్చు.
మెంతి ఆకులు :
మెంతి ఆకులను అలాగే నమలి తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. మెంతి కూర ఆకులతో కూరగాయల తరహాలో కర్రీ చేసుకుని తినొచ్చు. లేదంటే , డిటాక్స్ వాటర్ లేదా డ్రింక్స్ రూపంలో తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Calcium Rich Foods: క్యాల్షియం లోపంతో వచ్చే ఆరోగ్య సమస్యలు.. క్యాల్షియం అధిక మోతాదులో ఉండే ఫుడ్స్
తులసి ఆకులు :
తులసి ఆకుల గొప్పదనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందుకే ఆయుర్వేదంలో తులసి ఆకులు గురించి ఎంతో గొప్పగా ప్రస్తావించారు. తులసి ఆకులు నమిలే అలవాటు ఉన్న వారికి యూరిక్ యాసిడ్ సమస్య అసలు ఉండనే ఉండదట. అంతేకాదు.. తులసి ఆకులను తినడం వల్ల అధిక బరువు తగ్గడంతో పాటు మెదడు కూడా ఎంతో చురుకుగా పనిచేస్తుంది.
ఇది కూడా చదవండి : How To Lose Over Weight Without Exercises: జిమ్‌కి వెళ్లకుండా, ఎక్సర్సైజెస్ చేయకుండా అధిక బరువు తగ్గడం ఎలా ?
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించానికి ముందు వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి