COVID-19 vaccine తీసుకుంటే పిల్లలు పుట్టరా ?
Side effects of Covid-19 vaccine: కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే ఆనందం కొంతమందిలో కనిపిస్తుంటే... వ్యాక్సిన్ వాడితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటనే ఆందోళన ఇంకొంత మందిలో కనిపిస్తోంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే.. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న వారిలో స్త్రీలలో కానీ లేదా పురుషులలో సంతానోత్పత్తిపై ( infertility in men or women ) ప్రభావం చూపిస్తుందనే అపోహ చాలామందిలో కనిపిస్తోంది.

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి సంతానం కలగరనేది ( Infertility ) కేవలం అపోహేనా లేక నిజమా అనే విషయం తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
కరోనా వ్యాక్సిన్‌పై వస్తున్న వదంతులకు, అపోహలకు ( COVID-19 vaccine Myths ) చెక్ పెడుతూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ట్విటర్ ద్వారా గ్రాఫిక్స్ రూపంలో స్పందించారు. COVID-19 vaccine తీసుకున్న తర్వాత కొంతమందిలో కొద్దిపాటి జ్వరం, ఇంజెక్షన్ తీసుకున్న చోట నొప్పి, ఒళ్లు నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉందని.. అయితే, అవేవీ దీర్ఘకాలం పాటు ఉండవని, కొద్ది రోజుల్లోనే వాటంతట అవే తగ్గిపోతాయని కేంద్ర మంత్రి తెలిపారు.
Also read : COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఏ లక్షణాలు కనిపిస్తాయంటే..
Coronavirus vaccine కారణంగా ,సంతానం కలిగే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందనే ప్రచారాన్ని బలపరిచే శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రమంత్రి హర్షవర్ధన్ స్పష్టంచేశారు. అందుకే కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వం అధికారికంగా అందించే సమాచారాన్ని తప్ప ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే అనధికారిక సమాచారాన్ని విశ్వసించకూడదని కేంద్ర మంత్రి ( Union Health Minister Harsh Vardhan ) ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook