'ఇరిడియం' పేరెప్పుడైనా విన్నారా? ఇది భూమిపై దొరికే అత్యంత అరుదైన మెటల్. ఆ లోహమే క్యాన్సర్ కణాలను చెక్ పెడుతుందని ఇటీవల  చైనా, బ్రిటన్ శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ శాస్త్రవేత్తలకు ఈ విషయం ప్రయోగాల ద్వారా తెలిసింది. ఆరోగ్యకరమైన కణాలకు హాని కలగకుండా ఇరిడియం మెటల్ లోని ప్రత్యేకమైన ఆక్సిజన్ తో కూడిన పదార్థం లేజర్‌ కిరణాలకు ప్రభావితమై కాన్సర్ కణాలను చంపేస్తున్నట్లు తెలిసింది. ప్రయోగశాలలో కృత్తిమ ఊపిరితిత్తుల కాన్సర్ కణితిపై ఈ ప్రయెగం జరిగింది.


లేజర్‌ కిరణాలు పడ్డప్పుడు ఇరిడియంలోని ఆక్సిజన్‌ సింగల్‌టన్‌ ఆక్సిజన్‌గా మారిపోయిందని.. ఇది కాన్సర్ కణాలను మట్టుబెట్టింది. అల్ట్రా హైరెజుల్యూషన్‌ మాస్‌ స్పెక్ట్రోమెట్రీ ద్వారా పరిశీలించగా చక్కెరలను జీర్ణం చేసుకునేందుకు, ఒత్తిడి నిర్వహణకు ఉపయోగపడే ప్రోటీన్లపై ఇరిడియం మెటల్ ప్రభావం చూపుతున్నట్టు తెలిసిందని..  ఈ పరిశోధనకు చెందిన ఓ శాస్త్రవేత్త వివరించారు.