Cancer Risk: ఈ పనులు మానుకుంటే చాలు కేన్సర్ ముప్పు 50 శాతం తగ్గినట్టే
Cancer Risk: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ భయపెడుతూనే ఉంది. కేన్సర్ కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ప్రతి యేటా లక్షలాది మంది కేన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. అయితే మీ జీవనశైలి కూడా కేన్సర మహమ్మారికి కారణమని మీకు తెలుసా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Cancer Risk: కేన్సర్ మహమ్మారికి కారణాలు అనేకం. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి సగం కారణాలు కాగా జీన్స్ అంటే వంశపారంపర్యంగా వచ్చేది మరో సగం కారణం. అందుకే జీవనశైలి మార్చుకోవడం ద్వారా కేన్సర్ ముప్పును 50 శాతం తగ్గించవచ్చని వివిధ అధ్యయనాలు చెబుతున్నాయి. కొన్ని పనులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..
మీ దినసరి జీవితంలో తినే ఆహారం నుంచి మొదలుకుని మీ రోజువారీ కార్యక్రమాలు, మీ జీవనశైలి కేన్సర్ ముప్పును ప్రభావితం చేస్తుంటాయి. అంటే కేన్సర్ ముప్పు అనేది ముమ్మాటికి మీ అలవాట్లతో ముడిపడి ఉంటుంది. జీవనశైలిలో కొన్ని మార్పులు తీసుకురావడం ద్వారా కేన్సర్ ముప్పును 50 శాతానికి తగ్గించవచ్చని తాజాగా కొన్ని అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. అమెరికన్ కేన్సర్ సొసైటీ ప్రకారం కేన్సర్ కారణంగా సంభవించే మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చు. ఈ అధ్యయనంలో 30 ఏళ్లకు పైనబడిన వారిలో 30 రకాల కేన్సర్ వ్యాధి కారకాల్ని విశ్లేషించారు. మద్యపానం, ధూమపానం, స్థూలకాయం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ఎక్కువగా సూర్యుని వేడికి ఎక్స్ పోజ్ కావడం, వైరల్ సంక్రమణాల వల్ల కేన్సర్ ముప్పు పెరుగుతుంది.
ఈ అధ్యయనంలో జాతీయ స్థాయిలో కేన్సర్ ముప్పు కారకాలతో పాటు కేన్సర్ మరణాలపై కూడా విశ్లేషించారు. మార్చుకోదగిన జీవనశైలి కారకాల కారణంగా ఎంతమందికి కేన్సర్ సోకింది, ఎంతమంది మరణించారో అధ్యయనం చేశారు. అమెరికా కేన్సర్ సొసైటీ ప్రకారం నియంత్రణ అనేది కేన్సర్ ముప్పును తగ్గిస్తుంది. దీనికోసం పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్, వ్యక్తిగత అలవాట్లలో మార్పులు రావాల్సిన అవసరముంది. కేన్సర్ రాకుండా నియంత్రించడమే అత్యుత్తమ మార్గం. ఎప్పటికప్పుడు తగిన పరీక్షలు చేయించుకుంటుండాలి.
కేన్సర్ నియంత్రణ, ప్రారంభ లక్షణాలను గుర్తించడం అత్యంత కీలకం. కేన్సర్ ముప్పును తగ్గించేందుకు సామాజిక, వ్యక్తిగత ప్రాధాన్యతల్ని మెరుగుపర్చుకోవాలి. అప్పుడే కేన్సర్ ముప్పును చాలా వరకూ తగ్గించవచ్చు.
Also read: Vitamin Deficiency: ఆ ఒక్క విటమిన్ లోపిస్తే మీ బాడీ మొత్తం గుల్లయిపోతుంది జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook