Cancer Symptoms In Telugu: ఈ లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం చాలా మేలు.. లేకపోతే ఈ తీవ్రమైన కాన్సర్ ఎదుర్కొవాల్సిందే..!
Cancer Symptoms In Telugu: ప్రపంచంలో చాలా రకాల వ్యాధులకు మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ఇంకా ఎలాంటి ఔషధాలు కనుగొనలేదు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఈ వ్యాధికి లోనవుతున్నారు.
Cancer Symptoms In Telugu: ప్రపంచంలో చాలా రకాల వ్యాధులకు మందులు కనిపెట్టారు. కానీ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ఇంకా ఎలాంటి ఔషధాలు కనుగొనలేదు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది ఈ వ్యాధికి లోనవుతున్నారు. ముఖ్యంగా భారత్‌లో ప్రతి పది మందిలో ముగ్గురు నుంచి నలుగురు దాకా ఈ సమస్యకు గురవుతున్నారని నివేదికలు తేల్చి చెప్పాయి. అయితే ఇటీవలే ఈ వ్యాధి గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పలు ఆసక్తికర విషయాలను తెలిపింది. ఈ వ్యాధి కారణంగా మరణించే వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా రెండవ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా చాలా మంది ప్రోస్టేట్, పొట్ట, కొలొరెక్టల్, లివర్, థైరాయిడ్, ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడడం విశేషం.
ఇక మహిళల విషయానికి వస్తే.. గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ భయాందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే దీని వల్ల మరణించకపోవచ్చు కానీ.. ఈ వ్యాధిని ముందుగానే గ్రహించి చికిత్స పొందడం మంచిదని నిపుణుల అభిప్రాయం. అయితే ఈ వ్యాధికి గురయ్యే ముందు ఎలాంటి లక్షణాలుంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
వెజినల్ బ్లీడింగ్(Vaginal Bleeding):
ఆరోగ్యకరమైన స్త్రీలలో రియడ్స్ సమయంలో ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్ అవ్వడం ఓ శరీర ప్రక్రియ.. అయితే పీరియడ్స్ అయిపోయిన తర్వాత కూడా పీరియడ్స్..యుటెరైన్ క్యాన్సర్‌గా భావించవచ్చని నిపుణులు పేర్కొన్నారు.
దగ్గు(Cough):
చాలా మందిలో మారుతున్న సీజన్ కారణంగా దగ్గు ఓ సాధరణమైన సమస్య. కానీ ఇలాంటి సమస్య ఒక నెల నుంచి రెండు నెలలు ఉంటే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణం అవ్వొచ్చని నిపుణులు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
డిప్రెషన్(Depression):
ప్రస్తుతం చాలా మంది కుటుంబ, సామాజిక, ఆర్థిక కారణాల వల్ల డిప్రెషన్(Depression) గురవుతారు. ఇదీ మీలో తరుచుగా కనిపిస్తే క్యాన్సర్ లక్షణమని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా మెదడులో కణితి ఉన్నప్పుడు టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మలంలో రక్తం(Blood In Stool):
చాలా మందిలో పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఇలాంటి సమస్యతో బాధపడతారు. కానీ ఎలాంటి వ్యాధి లేనప్పుడు కూడా రక్తం తరచుగా వస్తే.. మల లేదా పెద్దప్రేగు క్యాన్సర్‌కు సంకేతం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు.
కారణం లేకుండా బరువు తగ్గడం(Weight Loss Without Reason):
నిరంతర వ్యాయామాలు చేయడం వల్ల బరువు తగ్గడం అందరికీ సాధారణం. ఎలాంటి వ్యాయామం లేకుండా బరువు తగ్గినట్లయితే.. అది క్యాన్సర్‌కు మొదటి సంకేతంగా భావించవచ్చు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Horoscope Today July 14th: నేటి రాశి ఫలాలు.. ఈ 4 రాశుల వారికి చంద్ర అనుగ్రహం కలుగుతుంది..
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook