Cancer Vaccine: కేన్సర్‌పై బిగ్ అలర్ట్, 2031 నాటికి కేన్సర్ వ్యాక్సిన్
Cancer Vaccine: కేన్సర్ ఓ ప్రాణాంతక మహమ్మారి. ప్రాణాంతక కేన్సర్ మందు కోసం నిత్యం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కేన్సర్ విషయంలో శుభవార్త అందుతోంది. ఆ వివరాలు మీ కోసం..
ఇప్పటివరకూ కేన్సర్ తప్ప అన్ని వ్యాధులకు మందు ఉంది. కేన్సర్ వంటి ప్రమాదకరవ్యాధికి మందు లేదా వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్న క్రమంలో..ఆ కంపెనీ నుంచి వచ్చిన అప్‌డేట్ ఆశాజనకంగా కన్పిస్తోంది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కేన్సర్ వ్యాధికి త్వరలో వ్యాక్సిన్ అందుబాటులో రానుందనే వార్త సంచలనమౌతోంది. అదే జరిగితే మానవాళికి మర్చిపోలేని మేలు జరిగినట్టే. మరో 8 ఏళ్లలో అంటే 2030 నాటికి కేన్సర్ వ్యాధికి వ్యాక్సిన్ అందుబాటులో రానుంది. కోవిడ్ 19 ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మెస్సెంజర్ ఆర్ఎన్ఏ షాట్‌ను ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఇద్దరు సైంటిస్టులు వెల్లడించిన విషయమిది.
కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను ఫైజర్ కంపెనీ.. BioNTech కంపెనీతో కలిసి అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీని సైంటిస్టులైన భార్యాభర్తలు Ozlem Tureci,Ugur Sahin స్థాపించారు. వచ్చే దశాబ్దానికి కేన్సర్ వ్యాక్సిన్ ప్రపంచమంతా అందుబాటులో వస్తుందని ఈ దంపతులు అంచనా వేస్తున్నారు.
2030 నాటికి కేన్సర్ వ్యాక్సిన్
కేన్సర్ రోగుల్ని బతికించడం లేదా కేన్సర్‌కు చికిత్స కనుగొనడం మన చేతుల్లోనే ఉందని భావిస్తున్నట్టు ప్రొఫెసర్ ఓజ్లెమ్ ట్యూరెసి బీబీసీకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ధి చేసే సమయంలో లభించిన కొన్ని అంశాల ఆధారంగా కేన్సర్ వ్యాక్సిన్ సాధ్యమేనని...రానున్న 8 ఏళ్లలో ప్రపంచానికి అందుబాటులో వస్తుందని ప్రొఫెసర్ ఉగుర్ సాహిన్ తెలిపారు.
ప్రస్తుతం ఈ కేన్సర్ వ్యాక్సిన్ అభివృద్ధి దశలో ఉంది. మెస్సెంజర్ ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా బాడీ కేన్సర్ కణాల్ని గుర్తించి..కేన్సర్‌పై దాడి చేసేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ వ్యాక్సిన్ ద్వారా..శరీరంలోని టీ సెల్స్..శరీరంలో ఉన్న ఇతర ట్యూమర్ సెల్స్‌ను స్క్రీన్ చేసి నిర్మూలిస్తాయని ప్రొఫెసర్ సాహిన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
mRNA ఆధారిత టెక్నాలజీతో కేన్సర్ చికిత్సను అందించేలా BioNTech కంపెనీ పరిశోధనలు చేస్తోంది. కోవిడ్ 19 వ్యాక్సిన్ అభివృద్ధిలో జరిపిన పరిశోధనలు కేన్సర్ పరిశోధనకు ఉపయోగపడుతున్నాయి. కేన్సర్ వ్యాక్సిన్‌కు అవకాశం లేకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నించినప్పుడు...అలా జరగదని ప్రొఫెసర్ ట్యురేసి చెప్పారు. కేన్సర్ వ్యాక్సిన్‌లో ప్రధానంగా ఉండేది కిల్లర్ టీ సెల్సా్‌ను చంపడమేనన్నారు.
Also read: Diabetes Control Tips: గుమ్మడికాయ గింజలతో ఇలా చేస్తే ఇంకో సారి మధుమేహం దరిదాపుల్లోకి రాదు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook