Cardamom For Weight Loss: కరోనా కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా బరుపు పెరగడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రణలో ఉండకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాకుండా స్థూలకాయానికి కూడా గురవుతున్నారు. అయితే చాలా మంది పెరుగుతున్న బరువును నియంత్రించుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అందులో భాగమే జిమ్‌ వెళ్లడం, కఠినమైన డైట్ పాటించడం. ఇవన్ని చేసిన చాలా మంది బరువు తగ్గలేకపోతున్నారు. అయితే బరువును ఇంట్లో లభించే పలు సుగంధద్రవ్యాలతో తగ్గించుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటితో సులభంగా బరువు తగ్గొచ్చు:


ఏలకులు శరీరంలో కొవ్వును నియంత్రిస్తుంది:


ఊబకాయం అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాకపోయిన వివిధ రకాల తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తిసే అవకాశాలున్నాయి. అయితే ఈ సమస్యలకు గురి కావడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడం కారణం చేతే ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఊబకాయం, బరువు పెరడం, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ నియంత్రణకు  ఏలకులు ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా  జలుబు, దగ్గు మరియు నోటి దుర్వాసనను కూడా నియంత్రిస్తాయి.


ఏలకుల ప్రయోజనాలు:


వీటిలో శరీరంలో చెడు కొవ్వును నియంత్రించే గుణాలున్నాయి.  ఏలకులను క్రమం తప్పకుండా వంటకాల్లో వినియోగిస్తే పొట్టలో సమస్యలు, బరువు తగ్గడం, చెడు కొలెస్ట్రాల్‌ వంటి సమస్యలు దూరమవుతాయి. అయితే రోజూ మీరు చేసుకునే ఆహారంలో వినియోగిస్తే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.


చెడు కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది:


ఏలకుల్లో జీర్ణక్రీయ శక్తిని పెంచే మూలకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కావున ఎసిడిటీ, మలబద్ధకం, కడుపులో చికాకు, గ్యాస్ వంటి పొట్టలో సమస్యలను కూడా దూరం చేస్తాయి. అంతేకాకుండా వీటితో చేసిన ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తినడం వల్ల తప్పకుండా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా రోజూ ఏలకులతో చేసిన  టీని తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also read: World Emoji Day: నేడే ప్రపంచ ఎమోజీ దినోత్సవం.. ఎందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారో తెలుసా..!


Also read:  Beard Growing Tips: మీకూ ఒత్తైనా గడ్డం రావాలంటే ఇలా చేయండి.. నెలలోనే స్ట్రాంగ్‌ బియర్డ్‌ వస్తుంది..!


 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook