Beard Growing In 1 Month: అబ్బాయిల అందానికి ఒత్తైనా గడ్డం కూడా ఓ కారణమే. అయితే ప్రస్తుతం చాలా మంది గడ్డాన్ని స్టైలిష్‌గా ఉంచుకోవాడానికి ప్రయత్నిస్తున్నారు. దీని కోసం చాలా మంది ఖరీదైనా ఉత్పత్తులను వాడుతుండడం విశేషం. అయితే ప్రస్తుతం వృద్ధుల నుంచి యంగ్ ఏజ్ వరుకు ప్రతి ఒక్కరూ గడ్డాన్ని స్టైలిష్‌గా పెంచుకుంటున్నారు. దీని వల్లే ముఖ సౌదర్యం కూడా పెరుగుతుందని నిపుణులు కూడా పేర్కొనడంతో చాలా మంది గడ్డాన్ని పెంచేందుకు అసక్తి చూపుతున్నారు. అయితే చాలా మందిలో జన్యు పరమైన కారణాల వల్ల గడ్డం పెగక పోవడం.. పెరిగిన ఒత్తుగా లేకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
జుట్టు పెరుగుదల అనేది హార్మోన్లపై ఆధారపడి ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. అయితే గడ్డం పెరుగుల కోసం చాలా మంది మార్కెట్ లభించే వివిధ రకాల ప్రోడక్ట్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. అలాంటప్పుడు నిపుణుల సలహాలను తీసుకుని ఇంట్లో చిట్కాలను వినియోగించడం చాలా మేలు. అయితే ఇంట్లో చిట్కాల ద్వారా ఎలాంటి ఫలితాలను పొందుతారో తెలుసుకుందాం..
కొబ్బరి నూనెతో గడ్డానికి మసాజ్ చేయండి:
చిన్న వయసుల్లో మనకు అమ్మమ్మలు, నానమ్మలు త్నానం చేయించే క్రమంలో తప్పకుండా కొబ్బరి నూనెతో శరీరమంత మసాజ్ చేసేవారు. ఇలా చేయడం వల్ల శరీరం దృఢంగా అవ్వడమేకాకుండా సౌందర్యవంతంగా కనిపిస్తుంది. అయితే ఈ కొబ్బరి నూనెను గడ్డానికి మసాజ్ 5 నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది గడ్డాన్ని ఒత్తుగా చేయడమేకాకుండా, దృఢంగా చేస్తుంది. కావున గడ్డం సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా దీనిని వాడాలని నిపుణులు పేర్కొన్నారు.
దువ్వెన(Comb )తో దువ్వాలి:
పాచి గడ్డం కారణంగా కొందరికి గడ్డం త్వరగా రాలిపోతోంది. అయితే దీనిని క్రమం తప్పకుండా దువ్వెన(Comb )తో దువ్వాలి. ఇలా చేయడం వల్ల గడ్డం సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా జుట్టు నిఠారుగా మారుతుంది. కావున గడ్డం పెరుగుదలకు కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. కావున ప్రతిరోజూ జుట్టుపై దువ్వెనతో దువ్వాలి.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్:
గడ్డం అస్సలు రాకపోతే.. తప్పకుండా మీరు వైద్యుని సలహాలు తీసుకుని హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకోవచ్చు. అయితే ఇలా చేయడం వల్ల గడ్డం ఒత్తుగా మొలుస్తుంది. ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ కేవలం వైద్యుడి సలహా మేరకే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Also read: Diabetes Tips: నియంత్రణే తప్ప..పూర్తి పరిష్కారం లేని వ్యాధి మధుమేహం..అందుకే ఈ జాగ్రత్తలు తప్పవు
Also read: Diabetes Tips: నియంత్రణే తప్ప..పూర్తి పరిష్కారం లేని వ్యాధి మధుమేహం..అందుకే ఈ జాగ్రత్తలు తప్పవు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook