Cashews Soaked In Milk Benefits: జీడిపప్పు మిశ్రమాన్ని పాలలో కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో తెలుసా? తప్పక తెలుసుకోండి..
Cashews Soaked In Milk Benefits: జీడిపప్పు మిశ్రమాన్ని పాలలో కలుపుకొని తీసుకోవడం వల్ల శీతాకాలంలో శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు కూడా సహాయపడతాయి. అంతేకాకుండా మధుమేహాన్ని కూడా నియంత్రిస్తాయి.
Cashews Soaked In Milk Benefits: డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి అంతేకాకుండా బాడీకి వెచ్చదనాన్ని అందించేందుకు ఎంతో సహాయ పడతాయి. అందుకే చాలామంది శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిల్లో ప్రతిరోజు జీడిపప్పును తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్ E, K, B6 వంటి పోషకాలు లభించడమే కాకుండా మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, సెలీనియం వంటి ఖనిజాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. అయితే జీడిపప్పును ప్రతిరోజు పాలలో కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో ఇలా కలిపి తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కేలరీలు:
జీడిపప్పులో అధిక పరిమాణంలో ప్రోటీన్స్ ఫైబర్ లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు పాలలో జీడిపప్పు మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో లభించే ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు శీతాకాలంలో ఇలా మిశ్రమంలో తయారు చేసుకొని పాలలో కలుపుకొని తాగితే మంచి ఫలితాలు పొందుతారు.
గుండె ఆరోగ్యం కోసం..:
ప్రతిరోజు జీడిపప్పు మిశ్రమాన్ని పాలలో కలుపుకొని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో గుండె జబ్బులతో బాధపడేవారు తప్పకుండా ఈ పాలను తీసుకోవాల్సి ఉంటుంది.
సంతానోత్పత్తి కోసం..
జీడిపప్పులో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచే అనేక రకాల మూలకాలు లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు పురుషులు జీడిపప్పు మిశ్రమాన్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల సంతానోత్పత్తిని పెంచుకోవడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని యాక్టివ్గా ఉంచేందుకు కూడా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!
ఎముకలను బలపరుస్తుంది:
జీడిపప్పులో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం వంటి పోషకాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు జీడిపప్పుతో తయారుచేసిన మిశ్రమాన్ని పాలలో కలుపుకొని తాగడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి అంతేకాకుండా ఎముకల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తరచుగా ఎముకల సమస్యలతో బాధపడేవారు తప్పకుండా జీడిపప్పు మిశ్రమాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ కోసం:
జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ ప్రోటీన్లు లభిస్తాయి కాబట్టి ప్రతిరోజు జీడిపప్పుతో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి..అంతేకాకుండా మధుమేహం కూడా అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Viral News: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook