Viral Story: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

Viral Story: చాలా మంది ఎన్నో రకాల ప్రశ్నలను కలిగి ఉంటారు. ఇటీవలే సోషల్‌ మీడియా Quoraలో మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానాలు లభించాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.     

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 11:49 AM IST
Viral Story: మృతదేహం నీటిలో ఎందుకు మునిగిపోదో తెలుసా? తప్పక తెలుకోవాల్సిన ఆసక్తికర విషయం!

 

Viral Story: ఈ ప్రపంచంలో మనకు తెలియని చాలా విషయాలు ఉంటాయి. కొన్ని విషయాలను మనం తెలుసుకోవడానికి ఆలోచిస్తే, మరికొన్ని విషయాలను తెలుసుకోవడానికి గూగుల్‌ను వాడుతూ ఉంటారు. అయితే కొన్ని విషయాలకు సంబంధించిన ప్రశ్నలకు ఎక్కడా సమాచారం దొరకదు. తెలుసుకోవాలనే తపనతో చాలా మంది ఇతరను అడుగుతూ ఉంటారు. అయితే ఇలాంటి ప్రశ్నలకు ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ సమాధానం చెబుతోంది. ఇటీవలే స్థాపించిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ Quoraలో ఓ వ్యక్తి ఇలా అడిగాడు..ఏ జీవైన నీటిలో చనిపోయిన తర్వాత ముగిపోకుండా ఎందుకు పైకి తేలుతుంది..అని ప్రశ్నించాడు. 

శవం నీటిపై ఎందుకు తేలుతుందంటే?
సోషల్ మీడియాలో చాలా మంది ఈ ప్రశ్నను అడిగారు..అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ సమాధానం చెప్పారు. వ్యక్తి లేదా జంతువు చనిపోయిన తర్వాత శరీరంలోపల బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీని కారణంగా బాడీలో వాయువులు ఉత్పత్తి అవుతాయి. దీంతో సులభంగా శరీర సాంద్రత తగ్గిపోయే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి వ్యక్తి చనిపోయిన తర్వాత నీటిపై తేలడం మొదలవుతుందని ఓ సోషల్‌ మీడియా వినియోగదారుడు తెలిపారు. 

చనిపోయిన తర్వాత శరీరంలో ప్రాణవాయువు సరఫరా పూర్తిగా ఆగిపోతుంది. అంతేకాకుండా కార్బన్ డయాక్సైడ్ సులభంగా బయటకు విడుదల అవుతుంది. దీంతో శరీరంలోని కణాలు, ఇతర వ్యవస్థ పూర్తిగా చనిపోవడం ప్రారంభమవుతుందని దీని కారణంగా కూడా శవం నీటిలో తేలుతుందని ఓ నెటిజన్‌ వివరించాడు. మరికొందరైతే..చనిపోయిన తర్వాత గాలి పరిమాణాలు శరీరంలో పెరుగుతాయని..దీని కారణంగా శరీర సాంద్రత తగ్గుతుంది. నీటీ సాంద్రత కూడా పెరుగుతుందని..దీని కారణంగా కూడా చనిపోయిన తర్వాత శవం నీటిపై తెలుతుందని..కొందరు సోషల్ మీడియా వినియోగదారులు తెలుపుతున్నారు. 

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

అయితే నీటిపై ఏ వస్తువు తేలడమైనా వస్తువు సాంద్రత, దాని స్థానభ్రంపై ఆధారపడి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. అధిక సాంద్రత కలిగిన వస్తువులన్నీ సులభంగా నీటిలో మునిగిపోతాయి. ఆర్కిమెడిస్ వివరించిన సూత్రం ప్రకారం..వస్తువు బరువుకు సంబంధించిన సరైన నీటిని స్థానభ్రంశం లేనప్పుడే నీటిలో మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే జీవించి ఉన్న వ్యక్తి అధిక సాంద్రతను కలిగి ఉంటాడు. కాబట్టి సులభంగా నీటిలో మునిగిపోతాడు. నీటిలో చనిపోయిన తర్వాత కొన్ని వాయువుల కారణంగా మృతదేహం చాలా ఉబ్బుతుంది. దీని కారణంగా సాంద్రత తగ్గుతుంది. దీంతో సులభంగా శవం నీటిపై తేలుతుంది. 

Also Read: Happy Diwali 2023: దీపావళి రోజు లక్ష్మీ పూజలో భాగంగా తామర పువ్వులు ఎందుకు సమర్పిస్తారో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News