Amudham: ఆముదం గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
Castor Oil Benefits: ఆముదం చెట్టుకు ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆముదం నూనెతో తయారుచేసిన ఆహారాలను తినడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా వీటి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు వాపుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Castor Oil Benefits: ప్రకృతి అందించిన ఆయుర్వేద మొక్కల్లో ఆముదం మొక్క ఒకటి. ఈ మొక్కలు ఎన్నో రకాల ఔషధ గుణాలు నిండి ఉంటాయి. అందుకే ఆయుర్వేద నిపుణులు ఈ మొక్కను వివిధ రకాల అనారోగ్య సమస్యలకు వినియోగిస్తూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ మొక్కను పంచాంగుల, ఏరండ అని కూడా పిలుస్తారు. ఈ మొక్కలో ప్రతిభాగం ఆయుర్వేద గుణాలు నిండి ఉంటాయి.
అడవుల్లో ఈ చెట్లు రెండు కలిగి ఉంటాయి. మనం తరచుగా చూసే ఎర్ర ఆముదం ఒకటైతే తెల్ల ఆముదం రెండవది. ఈ రెండు ఆముదాల్లో అనేక రకాల ఔషధ గుణాలు నిండి ఉంటాయి. అంతేకాకుండా వచ్చే గింజల నుంచి నూనెను కూడా తీస్తారు. ఇలా తీసిన నూనెను ఆముదం నూనెగా పిలుస్తారు. మన పూర్వీకులు వంటల్లో ఎక్కువగా ఈ ఆముదం నూనె అనే వినియోగించేవారు. ఆముదం నూనెతో తయారుచేసిన ఆహారాలను తినడం వల్ల కడుపులో తయారయ్యే నులి పురుగుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
అంతేకాకుండా మూల వ్యాధులతో బాధపడేవారు ఆముదం మొక్క ఆకులు ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు ఆకులను నూరి అందులోనే కర్పూరం కలిపి కట్టుకట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఆముదం నూనెను జుట్టుకు ప్రతిరోజు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు సమస్యలు తగ్గడమే కాకుండా.. జుట్టు పొడవుగా, ఒత్తుగా తయారవుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. నూనెలో ఉండే మైక్రోబయల్ లక్షణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. తరచుగా చర్మ సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ ఆముదం నూనెను అప్లై చేసుకోవాలి.
అంతేకాకుండా ఆముదం నూనెలో వాటి ఆకులను బాగా వేడి చేసి నొప్పులు ఉన్న ప్రదేశాల్లో కట్టుకట్టడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వాపులు కూడా సులభంగా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ఆముదం నూనెను అప్లై చేసి మసాజ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ ఆముదం నూనెతో తయారుచేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల మలబద్ధకం, అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి