Corona Revaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సందేహాలు వస్తూనే ఉన్నాయి. బూస్టర్ డోసు విషయంలో విభిన్న వాదనలు విన్పిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి(Corona Pandemic)నియంత్రణకు దేశంలో వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ రెండు వ్యాక్సిన్లే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వివిధ రకాల వైరస్ వేరియంట్లతో పోరాడేందుకు కరోనా మూడవ డోసు అంటే బూస్టర్ డోసు అవసరమనే విషయంలో విభిన్న రకాల వాదనలున్నాయి. వైద్య నిపుణులు బూస్టర్ డోసు అవసరమని చెబుతున్నా..ఇంకా ప్రామాణికం కాలేదు. దాంతో సందిగ్దత నెలకొంది. అయితే కోవాగ్జిన్‌కు అంతర్జాతీయ అనుమతి లేకపోవడంతో తలెత్తిన ఓ సమస్యకు సమధానంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం(Central government) చెప్పినదాని ప్రకారం కరోనా బూస్టర్ డోసుకు అనుమతి లేదని తెలుస్తోంది. 


కేరళకు చెందిన ఓ వ్యక్తి సౌదీ అరేబియాలో పని చేస్తున్నాడు.ఇండియాలో ఆ వ్యక్తి కోవాగ్జిన్(Covaxin)రెండు డోసులు పూర్తి చేసుకున్నాడు. అయితే కోవాగ్జిన్‌కు అక్కడి ప్రభుత్వం అనుమతించకపోవడంతో కోవిషీల్డ్(Covishield)వ్యాక్సిన్ ఇవ్వాలంటూ కేరళ హైకోర్టు(Kerala High Court)లో పిటీషన్ దాఖలు చేశాడు.ఈ పిటీషన్‌పై కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఒకసారి రెండు డోసులు పూర్తయ్యాక..మరోసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి రెండు డోసుల వ్యాక్సిన్ మాత్రమే ఇస్తున్నామని..అంతకంటే ఎక్కువ ఇస్తే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని..అంతర్జాతీయ గైడ్‌లైన్స్ కూడ సూచించలేదు కాబట్టి మరోసారి వ్యాక్సిన్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.ఈ పిటీషనర్ అభ్యర్ధనను మన్నిస్తే..రీ వ్యాక్సినేషన్(Revaccination)కోసం మరింత మంది కోర్టుల్ని ఆశ్రయించే అవకాశముందని కేంద్రం పేర్కొంది. రెండు డోసులు పూర్తయిన తరువాత మరో వ్యాక్సిన్‌కు అవకాశం లేదనే విషయం ఈ సంఘటనతో స్పష్టత వచ్చినట్టైంది. 


Also read: కాక్‌టైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మంచిది కాదంటున్న సీరమ్ ఛైర్మన్ సైరస్ పూనావాలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook