Covishield Side Effects: ఇండియాలో రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు విదేశాల్లో సైడ్ ఎఫెక్ట్స్ కన్పిస్తున్నాయి. మరి ఇండియాలో కోవిషీల్డ్ పరిస్థితి ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో కోవిషీల్డ్(Covishield), కోవ్యాగ్జిన్(Covaxin) వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute) ఉత్పత్తి చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ను ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా(Oxford - Astrazeneca) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. విదేశాల్లో ఈ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ గట్టిగానే కన్పిస్తున్న నేపధ్యంలో అదే కంపెనీ వ్యాక్సిన్ కోవిషీల్డ్ పేరుతో ఇండియాలో అందుబాటులో ఉండటంతో సందేహాలు తలెత్తుతున్నాయి. ఇండియాలో విదేశాల్లో వస్తున్నటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేవా అనేది పరిశీలిస్తున్నారు. ఇండియాలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నవారిలో సైడ్ ఎఫెక్ట్స్ (Covishield Sile Effects) ఏ స్థాయిలో వస్తున్నాయో పరిశీలించాల్సిందిగా యాడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ కమిటీని రంగంలో దింపింది. ఈ కమిటీ సభ్యులు డేటా సేకరించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. దేశంలో ప్రతి పది లక్షల డోసుల్లో 0.61 శాతం మాత్రమే వ్యాక్సిన్ వేశాక రక్తం గడ్డ కడుతున్నట్టు నివేదిక తెలిపింది. అంటే ప్రతి 20 లక్షలమందిలో ఒక్కరికి మాత్రమే అలా జరుగుతోంది ఇండియాలో.


ఇలా రక్తం గడ్డ కట్టడాన్ని థ్రాంబోబోలిక్ ఈవెంట్స్‌గా పిలుస్తారు. ఇందులో రక్తనాళంలో రక్తం గడ్డకడుతుంది. ఒక రక్తనాళం నుంచి మరో రక్తనాళానికి రక్తం సరఫరా ఆగిపోతుంది. ఈ విషయంపైనే ప్రధానంగా కమిటీ పరిశీలించింది. కమిటీ నివేదిక ప్రకారం కోవిషీల్డ్ లక్షణాల(Covishield Side Effects)సైడ్ ఎఫెక్ట్స్‌తో ఓ జాబితా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. ఊపిరి ఆడకపోవడం, రొమ్ములో నొప్పి, కాళ్లు, చేతుల్లో నొప్పి లేదా వాపు రావడం, ఇంజక్షన్ చేసిన చోట ఎర్రగా కందిపోవడం, అదేపనిగా కడుపునొప్పి, వాంతులు రావడం, మూర్చ పోవడం, తీవ్రమైన తలనొప్పి,నీరసం లేదా పక్షవాతం, కళ్లు మసకబారడం, కళ్లలో నొప్పి, ఒత్తిడి వంటి లక్షణాలు కన్పిస్తే వెంటనే వ్యాక్సినేషన్ సెంటర్లో ఫిర్యాదు చేయాలి. 


Also read: Remdesivir Injection: కరోనా బాధితులకు రెమిడెసివర్ ఇవ్వడాన్ని ఆపివేస్తారా, డాక్టర్ ఏమన్నారంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook