Remdesivir Injection | కరోనా సోకిన వారికి ప్రస్తుతం అందిస్తున్న ముఖ్యమైన మెడిసిన్ రెమిడెసివర్ ఇంజెక్షన్. కానీ కరోనా పేషెంట్లపై రెమిడెసివర్ ప్రభావం చూపుతున్నట్లుగా కనిపించడం లేదని, త్వరలో కోవిడ్19 చికిత్సలో భాగంగా ఈ ఇంజక్షన్‌ను తొలగించనున్నారని గంగా రామ్ ఆసుపత్రి చైర్‌పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా అభిప్రాయపడ్డారు. దేశంలో ఓవైపు కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుండగా, మరోవైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి.
కరోనా సోకిన తొలి రోజుల్లో ప్లాస్మా చికిత్సకు ప్రాధాన్యం ఇచ్చారు. అనంతరం కరోనా బాధితులకు రెమిడెసివర్ ఇంజక్షన్‌ను ప్రతిపాదిత మెడిసిన్‌గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకటించింది. కానీ గత కొన్ని రోజులుగా ప్లాస్మా థెరపీ ద్వారా ప్రయోజనం కలగడం లేదని డాక్టర్లు, వైద్య నిపుణులు గుర్తించారు. దీంతో కోవిడ్19 చికిత్స నుంచి ప్లాస్మా థెరపీని తొలగిస్తూ ఐసీఎంఆర్ ఇటీవల తాజా మార్గదర్శకాలు విడుదల చేయడం తెలిసిందే. ఇదే కోవలోకి రెమిడెసివర్ త్వరలో చేరనుందని డాక్టర్ రాణా చెబుతున్నారు.
Also Read: India Corona Cases: భారత్‌లో రికార్డు స్థాయిలో COVID-19 మరణాలు, కానీ అదొక్కటే ఊరట
యాంటీ బాడీలు త్వరగా ఉత్పత్తి కాకపోవడంతో కోవిడ్19 బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిసోతున్నాయని, ప్లాస్మా ధెరపీని కొనసాగించవద్దని వైద్యులకు ఐసీఎంఆర్ సూచించింది. యాంటీ బాడీ తీసుకున్నవారిలో, సాధారణ వ్యక్తులలో రోగనిరోధక శక్తిలో పెద్దగా మార్పులు కనిపించడం లేదని ఇటీవల ప్లాస్మా చికిత్సను నిలిపివేశారని వివరించారు. ఏ మెడిసిన్ అయితే ఫలితాన్ని ఇవ్వదో వాటి వాడకాన్ని ఆపివేస్తారని, తాజాగా రెమిడెసివర్ ఇంజెక్షన్లు కోవిడ్ బాధితులపై సత్ఫలితాలను ఇవ్వడం లేదని గుర్తిస్తున్నట్లు చెప్పారు. కనుక ఐసీఎంఆర్ త్వరలోనే రెమిడెసివర్ వాడకాన్ని నిలిపివేయనుందని డాక్టర్ రాణా అభిప్రాయపడ్డారు.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరింత ఆలస్యం
కాగా, దేశంలో గడిచిన 24 గంటల్లో తాజాగా 2,67,334 మంది కరోనా బారిన పడ్డారు. భారత్‌లో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2 కోట్ల 54 లక్షల 96 వేల 3 వందల 30కు చేరింది. గడిచిన 24 గంటల్లో 4,529 మంది కోవిడ్19తో పోరాడుతూ చనిపోయారు. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 2,83,7248కి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook