Chana Dal in Blood Sugar: శనగపప్పుతో షుగర్ మాయం.. అలాగే ఈ 5 లాభాలు కూడా..
Chana Dal in Blood Sugar: శనగపప్పులో శరీరానికి కావాల్సిన బోలెడు విటమిన్స్ ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. ఇవే కాకుండా బోలెడు లాభాలను అందిస్తాయి.
Chana Dal in Blood Sugar And Weight Loss: శనగపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే మన పూర్వికులు ఎక్కువగా తినేవారు. ఇందులో హై ప్రోటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వారంలో రెండు సార్లైనా తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ఇందులో గుండె ఆరోగ్యాన్ని పెంచే మూలకాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి గుండె సమస్యలతో బాధపడేవారు కూడా ప్రతి రోజు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవే కాకుండా ఇతర లాభాలు కూడా కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
శనగపప్పు తినడం వల్ల కలిగే లాభాలు:
బరువు నియంత్రణ:
శనగపప్పులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో తీసుకునే డైట్‌లో భాగంగా శనగపప్పును తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
గుండె ఆరోగ్యం:
శనగపప్పులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీని కారణంగా గుండెపోటు ఇతర సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
షుగర్ లెవెల్స్ నియంత్రణ:
శనగపప్పులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం కూడా సులభంగా తగ్గుతుంది.
ఎముకల ఆరోగ్యం:
శనగపప్పులో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలపరచి, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులను తగ్గించేందుకు ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు ఎముకలు కూడా బలంగా మారుతాయి.
జీర్ణక్రియ ఆరోగ్యం కోసం:
శనగపప్పులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను తగ్గించేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.