Health Tips: పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అందుకే చిన్న పిల్లలకు తప్పనిసరిగా పాలు తాగిస్తుంటారు. అయితే కొంతమంది పిల్లలు పాలు తాగేందుకు ఇబ్బందిపెట్టకుండా అద్భుతమైన చిట్కా గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలలో శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. పాలు ఒక బెస్ట్ ఎనర్జెటిక్ డ్రింక్‌గా కూడా చెప్పవచ్చు. పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. అయితే కొంతమంది చిన్న పిల్లలు పాలు తాగేందుకు చాలా ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి పరిస్థితుల్లో కొన్ని చిట్కాలతో అవే పాలను ఇష్టంగా తాగేట్టు చేయవచ్చు.


చిన్న పిల్లలు శారీరక, మానసిక వికాసానికి పాలు చాలా అవసరం. పాలలో ఉండే పోషక పదార్ధాలు ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే ప్రతి వైద్యుడు పిల్లలకు ప్రతిరోజూ పాలు తాగించమని చెబుతుంటారు. కానీ చాలామంది పిల్లలకు పాలు తాగడమంటే ఇష్టముండదు. పాలు తాగేందుకు చాలా ఇబ్బంది పెడుతుంటారు. ఈ పరిస్థితుల్లో పాలలో ఓ వస్తువు కలిపి తాగిస్తే..రుచి పెరగడమే కాకుండా ఇష్టంగా తాగుతారు. పిల్లలకు పాలంటే ఇష్టం కల్గించేందుకు ఏం కలపాలనేది పరిశీలిద్దాం..


1. పిల్లలకు సాధారణంగా చాకోలేట్ అంటే ఇష్టముంటుంది. చాకొలేట్ ఫేవర్ కలిపి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగేస్తారు. ఇందులో స్ట్రాబెర్రీ, వెనీలా, బటర్ స్కాచ్, రోజ్ వంటి ఫ్లేవర్లు కూడా కలపవచ్చు. పాలను మరింత రుచిగా, ఆరోగ్యంగా మారుస్తాయి.


2. పిల్లలకు బాదాం అంటే కూడా ఇష్టముంటుంది. పాలలో బాదాం పౌడర్ కలిపి తాగిస్తే పిల్లలు ఇష్టంగా తాగేందుకు అవకాశముంటుంది. బాదాం మిల్క్ చిల్డ్‌గా తాగిస్తే మరింత రుచిగా ఉంటుంది. 


3. మీ పిల్లలు పాలను ఇష్టంగా తాగాలంటే..మిల్క్ షేక్ రూపంలో ఇస్తే మంచి ఫలితాలుంటాయి. మిల్క్ షేక్, మేంగో షేక్, ఫ్రూట్ షేక్ మంచి ప్రత్యామ్నాయాలు. వీటివల్ల రుచి పెరగడంతో పాటు ఆరోగ్యానికి చాలా మంచిది. 


Also read: Guava Benefits: జామ పండు తినడం వల్ల డయాబెటిస్‌ వారికి కలిగే ప్రయోజనాలు ఇవే..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook