Bone Healthy Foods: పిల్లల ఎముకల ఆరోగ్యానికి, వారి పెరుగుదలకు పోషకాలు ఎంతో అవసరం. వాళ్లకు ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం అవసరం. తద్వార వారి ఎముక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. పిల్లల ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే ఈ 5 ఆహారపదార్థాలు వారి డైట్లో ఉండాల్సిందే. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా పిల్లల డైట్లో పాలపదార్థాలు అంటే పాలు, చీజ్‌, పెరుగు కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాలు, ప్రొటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్‌ వీటిలో పిల్లల ఎముక ఆరోగ్యానికి సహయపడే పోషకాలు ఉంటాయి. వీటిని స్మూథీ, మిల్క్ షేక్స్, పెరుగు ఉండే సలాడ్స్, శాండ్విచ్‌లో వేసి తేనెతో కలిపి సులభంగా తినిపించవచ్చు.


ఆకుకూరలు..
ఆకుపచ్చ కూరగాయలు పాలకూర, కాలెలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో విటమిన్ కే, మెగ్నిషియం, ఫైబర్ కూడా ఉంటుంది. ఇందులో అనేక పోషకాలు మన ఆరోగ్యానికి సరిపడా మినరల్స్ ఉంటాయి. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో మెటబాలిక్ రేటు పెరుగుతుంది. ఎముక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. మీ పిల్లలు ఇష్టపడే ఆహారం అయిన పాస్తా, పిజ్జా, డ్రింక్స్‌, శాండ్విచ్‌లో వేసి వారికి ఇవ్వండి.


ఇదీ చదవండి: 


ఫ్యాటీ ఫిష్‌..
సాల్మాన్ ఫిష్‌లో విటమిన్ డీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. సాల్మాన్, మేకరల్, సార్డినెన్ చేపల్లో ఎముక ఆరోగ్యాన్ని బూస్ట్‌ చేస్తాయి. కాల్షియం గ్రహించడాన్ని మెరుగుపరుస్తుంది. సాల్వాన్ చేపను గ్రిల్‌ లేదా బేక్ చేసి పిల్లలకు పెట్టాలి. తందూరీ డిషస్ చేసినప్పుడు క్యాన్డ్‌ సార్డినెస్‌ ను సలాడ్స్, శాండ్వీచ్‌లో వేసి ఇవ్వండి.


నట్స్..
బాదం, చియాసీడ్స్, నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో కాల్షియం, మెగ్నిషియం, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని కూడా స్మూథీ, షేక్స్ లో వేసి ఇవ్వండి.


ఇదీ చదవండి: 


బీన్స్...
శనగలు, కిడ్నీ బీన్స్, బ్లాక్ బీన్స్ లలో కాల్షియం, ఫైబర్‌, మెగ్నిషియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. ఎముక అభివృద్ధికి తోడ్పడతాయి. ఉడకబెట్టిన బీన్స్ సూప్స్, స్ట్యూలో వేసి పిల్లలకు ఇవ్వండి. అంతేకాదు అన్నంలో ఇతర ఆహారాల్లో కూడా వేసుకుని తీసుకోవచ్చు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter