Cholesterol Control Tips: మీరు రోజూ తీసుకునే ఆహారంతోనే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
Cholesterol Control In 5 Days: : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. అవయవాలకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే చాలా మందికి తెలియదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ LDL, మంచి కొలెస్ట్రాల్ HDL మంచి కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి.
Cholesterol Control In 5 Days: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. అవయవాలకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా పలు రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే చాలా మందికి తెలియదు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ LDL, మంచి కొలెస్ట్రాల్ HDL మంచి కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి. అయితే చాలా మంది ప్రస్తుతం ఈ సమస్యలతో బాధపడుతున్నారు. కావున వీరు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యల కారణంగా చాలా మందిలో గుండె పోటు, మధుమేహం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టడానికి పలు చిట్కాలను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు..
వీటి వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్యలు దూరమవుతాయా..?:
1) సోయా పాలు:
సోయా పాలలో శరీరానికి కావాల్సి చాలా రకాల పోషకాలుంటాయి. అంతేకాకుండా సంతృప్త ఆహార స్థాయి తక్కువగా ఉంటుంది. సోయా పాలలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాలను తగ్గించే చాలా రకాల మూలకాలు ఉంటాయి. కావున చెడు కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందడానికి తప్పకుండా సోయా పాలు తీసుకోవాలి.
2) ఓట్స్ డ్రిక్స్:
శరీర బరువు తగ్గించడానికి ఓట్స్ ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా వీటిలో పాలు కలుపుని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని బీటా-గ్లూకాన్ ఆహారంగా కూడా పిలుస్తారు.
3) గ్రీన్ టీ:
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్ల అధిక పరిమాణంలో ఉంటాయి. ఇందులో కాటెచిన్స్, ఎపిగాల్లో, కాటెచిన్, గాలెట్ అనే మూలకాలు అధిక పరిమాణంలో ఉంటాయి. కావున రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల ఎల్‌డిఎల్, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలో గ్రీన్ టీ కంటే తక్కువ కాటెచిన్స్ ఉంటాయి. కావును త్వరగా బరువును కూడా తగ్గిస్తాయి.
4) టమోటా రసం:
టమోటాలో అధిక పరిమాణంలో పోషకాలుంటాయి. కావున వీటిని అధికంగా తీసుకునేందుకు ప్రజలు ఇష్టపడతారు. అంతేకాకుండా ఇందులో అధిక పరిమాణంలో లైకోపీన్ ఉంటుంది. కావున వీటిని రసంగా తాగితే శరీరానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ స్థాలను కూడా నియంత్రిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook