Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

Weight Loss In 8 Days: బరువు తగ్గే క్రమంలో ప్రస్తుతం చాలామంది వివిధ డైట్లను ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యమైన ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాంసాహారులైతే.. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, మటన్, గుడ్లు తింటున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 19, 2022, 10:04 AM IST
  • ఈ సలాడ్స్‌ను రోజూ తీసుకుంటే చాలు
  • మీరు అనుకున్నంత బరువు తగ్గుతారు.
  • బీన్స్ సలాడ్ శరీరానికి చాలా అవసరం
Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..

Weight Loss In 8 Days: బరువు తగ్గే క్రమంలో ప్రస్తుతం చాలామంది వివిధ డైట్లను ఫాలో అవుతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యమైన ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాంసాహారులైతే.. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, మటన్, గుడ్లు తింటున్నారు. వీటిని బరువు తగ్గే క్రమంలో డైట్ లో భాగంగా తక్కువ పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు అని ప్రముఖ డైటీషియన్లు చెప్తున్నారు. మాంసాహారులైతే ప్రోటీన్లు అధిక పరిమాణంలో ఉండే మాంసలను తీసుకోవచ్చు. మరి శాకాహారులు ఎలా అని ఆశ్చర్యపోతున్నారా.? శాకాహారులు కూడా డైట్ లో భాగంగా ప్రోటీన్లు అధిక పరిమాణంలో ఉండే పలు రకాల సాలడ్స్, ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా.. అనారోగ్య సమస్యల బారిన పడకుండా బరువు తగ్గొచ్చు. అయితే శాకాహారులు ఎలాంటి సాలర్స్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా సులభంగా బరువు తగ్గుతారు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1. బీన్స్ సలాడ్:
బీన్స్ లో శరీరానికి అవసరమైన అధిక పరిమాణంలో ప్రోటీన్లు ఉంటాయి. అయితే చాలామంది వీటిని ఆహార పదార్థాలలో ఉపయోగిస్తారు. ఆహార పదార్థాల్లో కాకుండా సాలాడ్స్ రూపంలో తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అయితే సలాడ్స్ చేసే క్రమంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైవి సాలడ్స్ లో వేసే ఇంగ్రిడియంట్స్.. తప్పకుండా ఈ సలాడ్ లో నిమ్మరసంతో పాటు.. తులసి ఆకులు మిరియాలు, వెల్లుల్లి, ఉప్పు తగిన పరిమాణంలో మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసుకొని సాలడ్స్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు బరువు సులభంగా తగ్గుతారని వైద్యులు తెలుపుతున్నారు.

2. పనీర్, ఖీరా సలాడ్:
పనీర్ అంటే చాలామంది తింటూ ఉంటారు. ఇక దోసకాయ విషయానికొస్తే.. జీర్ణ క్రియను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అయితే ఈ రెండు ఆహార పదార్థాలను సాలర్స్ రూపంలో తీసుకుంటే బరువు సులభంగా నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గే క్రమంలో తప్పకుండా ఈ సాలాడ్ని తీసుకుంటే ఆరోగ్యంతో బరువు తగ్గుతారని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు ఉంటాయి కాబట్టి.. శరీరాన్ని దృఢంగా చేసి.. బరువును సులభంగా తగ్గిస్తుంది. ఈ సలాడ్ ను తయారు చేసే క్రమంలో తప్పకుండా టమాటా ముక్కలతో పాటు.. తేనె, నిమ్మరసం, మిరియాలు, ఉప్పుతో మిక్స్ చేసుకొని ఉదయం పూట ఆహారంగా తీసుకోవాలి. ఇలా చేస్తే తొందర్లోనే మంచి ఫలితాన్ని పొందుతారు.

3. బచ్చలికూర సలాడ్:
బచ్చలి కూర శరీరానికి మంచి ప్రోటీన్స్ అందించడమే కాకుండా.. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. అయితే ఇది బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం క్రమం తప్పకుండా ఆకులతో చేసిన సలాడ్స్ ను ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకోవాలి. ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు ఉండడం వల్ల శరీర బరువును సహజంగా ఆరోగ్యంగా తగ్గిస్తుంది. అయితే ఈ సలాడ్ తయారు చేసే క్రమంలో తప్పకుండా పుదీనాను వేసుకోవాలి. ఇలా చేస్తే మీరు రెట్టింపు ప్రయోజనాన్ని పొందుతారు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Jabardasth Praveen : జబర్ధస్త్ ప్రవీణ్ ఇంట్లో విషాదం.. కోలుకోలేని దుఖంలో ప్రవీణ్

Also Read: Nassar: సినీ నటుడు నాజర్‌కు గాయాలు..ఆస్పత్రికి తరలింపు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News