Cholesterol Control Remedies: రక్తంలో పెరిగే కొవ్వులను కొలెస్ట్రాల్ అని అంటారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిన, మంచి కొవ్వులు పెరిగిన శరీరంపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలో  కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే గుండె సంబంధిత సమస్యలు ఉత్పన్నయ్యే ఛాన్స్‌ ఉంటుంది. అయితే మారుతున్న  జీవన శైలికారణంగా ఆహారంపై శ్రద్ధ వహించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటి కారణంగానే  కొలెస్ట్రాల్ స్థాయిలపై  ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల ఆహార నియమాలను పాటించడం మంచిదని.. అంతేకాకుండా వ్యాయమం చేయడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నియమాలను పాటించడం వల్ల అనేక రకాల సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఆ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక కొలెస్ట్రాల్‌కు ప్రధాన కారణాలు:


>> ఒత్తిడికి గురి కావడం
>> రోజూ మద్యం సేవిచడం
>> జంక్ ఫుడ్ తినడం
>> జన్యుపరమైన సమస్యల వల్ల


కొలెస్ట్రాల్ నియంత్రణ కోసం ఈ నియమాలను తప్పకుండా పాటించండి:


ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినండి:


వెల్లుల్లిలో అధిక పరిమాణంలో అల్లిసిన్ అనే మూలకాలుంటాయి. ఇవి గుండెపోటును నియంత్రిస్తుంచి.. రక్తపోటును తగ్గిస్తుంది. దీని కోసం ప్రతి రోజూ 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలను ఖాళీ కడుపుతో తినాలి. ఇది శరీరంలో అధిక కొలెస్ట్రాల్‌ స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది.


వాల్‌నట్స్‌:


వాల్‌నట్స్‌ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించేందుకు దోహదపడుతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల  రక్త నాళాలలో సమస్యలు తొలగిపోయి. చెడు కొలెస్ట్రాల్‌ను శుభ్రం చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిస్తుంది.


అవిసె గింజలు:


అవిసె గింజల్లో చాలా రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ అధిక పరిమాణంలో ఉంటుంది. కావున అవిసె గింజలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. కావున మధుమేహం వ్యాధి గ్రస్తులు క్రమం తప్పకుండా అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also read: Monsoon Health Tips: వానా కాలంలో వచ్చే జబ్బులేవైనా.. ఇలా అల్లంతో చెక్‌ పెట్టొచ్చు..!


Also read: Hair Care Tips: స్ట్రెయిటెనింగ్‌ చేసిన తర్వాత జుట్టు రాలిపోతుందా.. అయితే ఇలా చేయండి..!


 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook