Cholesterol Control Tips: మామిడి పండుతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కు చెక్!
Cholesterol Control Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. ఈ క్రమంలో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడం ఎంతో ముఖ్యం. అయితే మామిడి కాయ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించుకునే మార్గం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Cholesterol Control Tips: మనలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు. కానీ, మన ఇంట్లోనే కొన్ని చిట్కాలతో కొలెస్ట్రాల్ ను ఇట్టే తగ్గించుకోవచ్చు. వేసవిలో దొరికే మామిడి పండు గింజ వల్ల ఆ కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు. మామిడి పండు తిన్న తర్వాత దాన్ని పడేయకుండా.. ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి గింజలతో కడుపునకు మేలు!
వేసవిలో దొరికే అమృత ఫలం మామిడి. దీని చాలా మంది ఇష్టంగా తింటుంటారు. అయితే అందులో ఉండే గింజల వల్ల కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మామిడి గింజలతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవచ్చు. దీంతో పాటు కడుపునకు సంబంధించిన వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ కోసం..
దీంతో పాటు షుగర్ వ్యాధిగ్రస్తులు మామిడి పండు గింజలను తినడం వల్ల మేలు జరుగుతుంది. వీటిని తినడం వలన మీ రక్తంలో చక్కెర స్థాయి కూడా నియంత్రణలో ఉంచుతుంది. డయాబెటిక్ పేషెంట్ల మామిడి గింజలు (టెంకలో ఉండే విత్తనం) చాలా మేలు చేస్తుంది.
మామిడి విత్తనాల వల్ల కలిగే ప్రయోజనాలు..
1) పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవడానికి మామిడి విత్తనాలను తీసుకోవచ్చు. నెలసరి సమయంలో స్త్రీలలో కలిగే అసౌకర్యాన్ని తొలగిస్తుంది.
2) గుండెను ఫిట్‌గా ఉంచడంలో కూడా ఈ మామిడి విత్తనాలు సహకరిస్తాయి. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా తగ్గుతుంది.
3) మామిడి విత్తనాలు దంతాలకు కూడా మేలు చేస్తాయి. వాటిలోని కాల్షియం దంతాల అభివృద్ధికి సహాయపడుతుంది.
(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)
Also Read: Curd Health Benefits: పెరుగులో వీటిని కలుపుకొని తినడం వల్ల సగం రోగాలు దూరమవుతాయి!
Also Read: Black Pepper for Weight Loss: నల్ల మిరియాల వినియోగంతో మీరు తక్షణం బరువు తగొచ్చు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.