Cholesterol Control Tips: రోజూ ఉదయం పూట ఇలా చేస్తే చెడు కొలెస్ట్రాల్ వెన్నెలాగా కరిగిపోవడం ఖాయం..
Cholesterol Diet: శరీర అభివృద్ధికి కొలెస్ట్రాల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రతి మానవ శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే ఇంకోటి చెడు కొలెస్ట్రాల్.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే సమస్యలు ఉన్నాయి.
Cholesterol Diet: శరీర అభివృద్ధికి కొలెస్ట్రాల్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ప్రతి మానవ శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే ఇంకోటి చెడు కొలెస్ట్రాల్.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే సమస్యలు ఉన్నాయి. కావున ఈ కొలెస్ట్రాల్ నియంత్రించడానికి ప్రస్తుతం చాలామంది వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే దీనిని తగ్గించేందుకు పలు రకాల ఆహార నియమాలు పాటిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అల్పాహారం తీసుకునే క్రమంలో ఈ ఐదు ఆహారాలను తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఓట్స్:
ఓట్స్ లో శరీరంలో కరిగే ఫైబర్ కంటెంట్ అధిక పరిమాణంలో ఉంటుంది. కావున ఇది రక్తంలోని చక్కర పరిమాణాన్ని సులభంగా నియంత్రించేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఈ ఆహారాన్ని తీసుకోవాలి.
బెండకాయ:
బెండకాయతో తయారు చేసిన నీరు ఓక్రా నీరుగా పిలుస్తారు. ఇందులో చాలా రకాల పోషకాలు ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ చెక్ పెట్టేందుకు సహాయపడుతుంది. ఉదయం తీసుకునే అల్పాహారంలో భాగంగా వీటితో చేసిన ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరగడమే కాకుండా.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రిస్తుంది.
యాపిల్స్:
అనారోగ్య సమస్యలను ఉపశమనం కలిగించేందుకు పండ్లు, కూరగాయలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా పండ్లలో యాపిల్స్ పండ్లు శరీరానికి పోషక విలువలు అందించడమే కాకుండా.. శరీరంలో సంవత్సరాల పాటు పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ నిలువలను సులభంగా నియంత్రిస్తుంది. కావున ఉదయం పూట అల్పాహారానికి ముందు వీటిని తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
డ్రై ఫ్రూట్:
డ్రై ఫ్రూట్స్ కూడా శరీరానికి ఎంతో అవసరం ఇందులో బాడీకి అవసరమైన పోషక విలువలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి బాడీని హెల్తీగా ఉంటాడనే కాకుండా.. ఇతర వ్యాధుల నుంచి సంరక్షిస్థాయి. ముఖ్యంగా ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాలకు చెక్ పెట్టొచ్చు.
వెల్లుల్లి:
నిత్యం వంటలో భాగంగా వెల్లుల్లిని ఉపయోగిస్తారు. ఇది కూరలకు రుచి దించడమే కాకుండా.. శరీరానికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర సమస్యలు దూరం అవ్వడం కాకుండా.. చెడు కొలస్ట్రాలను అంతం చేస్తుంది. కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ నియమాలు పాటించాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook