Cholesterol: కొలెస్ట్రాల్ ఎంతవరకూ ప్రమాదకరం, ఏయే వ్యాధుల ముప్పు ఉంటుంది
Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ వివిధ రకాల సమస్యలు ఎదురౌతుంటాయి. అందుకే దేన్నిపట్టించుకోకపోయినా..కొలెస్ట్రాల్‌ను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య చాలా ఎక్కువైంది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి ఇందుకు కారణం. చాలామంది కొలెస్ట్రాల్ సమస్యను తేలిగ్గా తీసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి మూల్లం చెల్లించుకోవల్సి వస్తుంది.
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి చెడు కొలెస్ట్రాల్ కాగా రెండవది గుడ్ కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే చాలా వ్యాధులకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ అనేది మైనం వంటి పదార్ధం. ఇది రక్తంలో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల వివిధ రకాల వ్యాధులు ఉత్పన్నమౌతాయి. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం మంచిది కాదు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఏ విధమైన సమస్యలు తలెత్తుతాయో చూద్దాం..
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఉత్పన్నమయ్యే వ్యాధులు
హార్ట్ ఎటాక్ ముప్పు
కొలెస్ట్రాల్ పెరగడం అనేది గుండెకు ఏ మాత్రం మంచిది కాదు. హార్ట్ ఎటాక్ ముప్పు పెరిగి ప్రాణాంతకం కావచ్చు. ఎందుకంటే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అదంతా ధమనుల గోడలకు పేరుకుపోతుంది. ఫలితంగా ఛాతీలో నొప్పి..హార్ట్ ఎటాక్ ముప్పు ఎదురుకావచ్చు.
స్ట్రోక్ ముప్పు
హై కొలెస్ట్రాల్ కారణంగా స్ట్రోక్ ముప్పు భారీగా పెరిగిపోతుంది. హై కొలెస్ట్రాల్ అనేది కేవలం గుండె వరకే కాకుండా మెదడు వరకూ వెళ్లే ధమనుల్ని కూడా బ్లాక్ చేస్తుంది. దాంతో మెదడు వరకూ రక్తం సరఫరా కాదు. ఫలితంగా స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది.
కిడ్నీ ఫెయిల్యూర్
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కిడ్నీపై పెను ప్రభావం పడుతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణం కావచ్చు. ఎందుకంటే కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల కిడ్నీ సంబంధిత వెస్సెల్స్ లో ప్లాక్ వంటి నిర్మాణం ఏర్పడుతుంది. దాంతో రక్తం సరఫఱాలో ఆటంకం కలుగుతుంది. ఇది కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణం కావచ్చు.
Also read: Cardamon Benefits: రోజూ తీసుకుంటే..అధిక రక్తపోటు, కేన్సర్, బ్లడ్ షుగర్ సమస్యలకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook