Cholesterol Home Remedies: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందిలో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే ఇలా బాడీలో కొవ్వు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు, ఒత్తిడి కారణంగా కూడా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పెరుగుతున్న కొవ్వును నియంత్రించుకునేందుకు పలు హోమ్ రెమెడీస్ కూడా పాటించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఇంటి చిట్కాలు పాటించడం వల్ల సులభంగా కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిన్న వయసులో కొలెస్ట్రాల్‌ పెరగడానికి కారణాలు:
పూర్వీకులు ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకునేవారు..భోజనంలో వారు ఎక్కువగా చిరు ధాన్యాలు మాత్రమే తీసుకునేవారు. అయితే నేటి యువత మార్కెట్‌లో లభించే ప్రాసెస్‌ చేసిన ఆహారాలు, స్ట్రీట్‌ ఫుడ్స్‌ అతిగా తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అంతేకాకుండా చాలా మంది మద్యం కూడా అతిగా తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి కారణాల వల్లే శరీరంలో విపరీతంగా కొలెస్ట్రాల్‌ పేరుకుపోతోందని పరిశోధనల్లో తెలింది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు శరీరక శ్రమ చేయడమే కాకుండా  లిన్సీడ్ గింజలు, దాల్చినచెక్క నీరు ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..


అవిసె గింజలు ఎలా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయో తెలుసా?:
కొలెస్ట్రాల్ తగ్గాలంటే అవిసె గింజలను బాగా గ్రైండ్ చేసి..పొడిలా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ పొడిని గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఫైబర్‌ అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
 
దాల్చిన చెక్క నీరు:
దాల్చిన చెక్క ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది కొలెస్ట్రాల్‌ను కరిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. అయితే దీని కోసం మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో చిటికెడు దాల్చిన చెక్క పొడిని మిక్స్‌ చేసుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల సీజనల్‌ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి