Cholesterol tips: కొలెస్ట్రాల్ అనేది సాధారణంగా రక్త వాహికల్లో ఉండే మైనం లాంటి పదార్ధం. శరీరంలో హెల్తీ సెల్స్ నిర్మాణానికి ఇవి దోహదపడతాయి. కానీ చెడు కొలెస్ట్రాల్ అనేది ఏ మాత్రం మంచిది కాదు. స్థూలకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్, స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా హై కొలెస్ట్రాల్ కేసులు అసింప్టమెటిక్ అంటే లక్షణాలు కన్పించనివిగా ఉంటాయి. కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవడం కష్టమౌతుంది. కానీ కొన్ని సంకేతాలు కన్పిస్తే కళ్లలో ఆ లక్షణాలు స్పష్టంగా కన్పించవచ్చు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ ప్రభావం కళ్లలో స్పష్టంగా కన్పిస్తుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వార్నింగ్ సంకేతాలు కన్పిస్తాయి. సాధారణంగా కాళ్లు, చేతులు చూసి చెబుతుంటారు. అయితే కళ్లలో కన్పించే ఆ లక్షణాలతో కూడా కొలెస్ట్రాల్ ముప్పును పసిగట్టవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కళ్ల చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. దీనిని సకాలంలో గుర్తించగలిగితే ఏ సమస్యా ఉండదు.  ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం..


1. కళ్ల చుట్టూ పసుపుగా కన్పించడం
2. కళ్లు మసకగా కన్పించడం, బ్లరింగ్ విజన్
3. కార్నియా చుట్టూ పసుపు, గోధుమ, తెలుపు రంగుల్లో మచ్చలు


చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు సాధారణంగా బయటపడవు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే అప్పడప్పుడూ బ్లడ్ పరీక్షలు చేయించుకోవాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లలో తక్షణం మార్పులు చేసుకోవాలి. లేకపోతే లేనిపోని సమస్యలు ఎదుర్కోవల్సివస్తుంది. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్, స్వీట్స్‌కు దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్స్ , ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరం పాటించాలి.


Also read: Home Remedies: మలబద్ధకం అదే పనిగా బాధిస్తోందా, ఇలా చేసి చూడండి, తక్షణ ఉపశమనం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook