Coconut Water: కొబ్బరి నీళ్లు చలికాలంలో తాగొచ్చా లేదా, ఏమౌతుంది
Coconut Water: ప్రకృతిలో ఎన్నో రకాల అద్బుతమైన పోషక విలువలుండే పదార్ధాలుంటాయి. కొన్ని సీజనల్ అయితే మరి కొన్ని ఏడాది పొడవునా లభ్యమౌతాయి. అందులో అతి ముఖ్యమైంది కొబ్బరి కాయలు. కొబ్బరి నీళ్లను అమృతంతో పోలుస్తారు. ముఖ్యంగా వేసవిలో బెస్ట్ డ్రింక్. మరి చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగవచ్చా లేదా...
Coconut Water: శరీర ఆరోగ్యం, ఎదుగుదలకు దోహదపడే ఎన్నో రకాల పోషకాలు కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆరోగ్యపరంగా చాలా అద్భుతమైనవి. ఎన్నో రకాల వ్యాధుల్ని దూరం చేస్తాయి. కొబ్బరి నీళ్లను బెస్ట్ హైడ్రేట్ డ్రింక్ కావడంతో వేసవిలో అధికంగా వినియోగిస్తారు. అయితే చాలామందికి చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది.
కొబ్బరి నీళ్లు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఇందులో ఉండే పోషకాల కారణంగా శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. వివిధ రకాల వ్యాధుల్నించి రక్షణ లభిస్తుంది. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. కానీ చలికాలంలో ఎక్కువగా తాగకూడదని చాలామంది అనుకుంటారు. కానీ ఇది ముమ్మాటికీ తప్పు. కొబ్బరి నీళ్లకు సీజన్‌తో సంబంధం లేదు ఎప్పుడైనా తాగొచ్చు. ప్రయోజనాలే తప్ప హాని కలగదు. కొబ్బరి నీళ్లు రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎప్పుడైతే జీర్ణక్రియ మెరుగవుతుందో ఎసిడిటీ, కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తొలగిపోతాయి. చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తపోటు, గుండె వ్యాధులు దూరమౌతాయి.
చలికాలంలో సాధారణంగా ఇమ్యూనిటీ తగ్గుతుంటుంది. అందుకే ఈ సమయంలో కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల చర్మం హైడ్రేట్‌గా ఉండి ఆరోగ్యంగా ఉంటుంది. ఏ విధమైన చర్మ సమస్యలు ఉత్పన్నం కావు.
కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఇందులో ఉండే మెగ్నీషియం, ఎంజైమ్స్ అనేవి శరీరంలో విష పదార్ధాలను తొలగించి బాడీని డీటాక్స్ చేస్తాయి. పొడి చర్మం సమస్య ఉన్నవాళ్లు చలికాలంలో కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలి.
Also read: Pomegranate Seeds: రోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు తాగితే ఏమౌతుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.