Coffee and Cholesterol: మీరు ఇలా కాఫీలు తాగితే గుండె పోటు సమస్యలు తప్పవా?, కొలెస్ట్రాల్ నిజంగా పెరుగుతుందా?
Coffee and Cholesterol: ప్రస్తుతం చాలా మంది కాఫీలను విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తప్పకుండా మీరు అతిగా కాఫీలను తాగడం మానుకోండి.
Coffee and Cholesterol: ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ లేదా కాఫీని తాగడానికి ఇష్టపడుతారు. ప్రస్తుతం కొంతమందికి కాఫీ అంటే చాలా ఇష్టం.. కాబట్టి ఆఫీసులో ఎప్పుడూ కాఫీతో పాటు టీలను తాగుతూ ఉంటారు. అయితే ఇటివలే పలు అధ్యయనాలు కాఫీని అతిగా తాగడవ వల్ల కలిగే దుష్ప్రభాల గురించి పేర్కొంది. అతిగా టీలతో పాటు కాఫీలు తాగేవారిలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని, ముఖ్యంగా కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో పాటు.. గుండె పోటు సమస్యలు కూడా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అతిగా కాఫీ తాగడం వల్ల శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాఫీకి కొలెస్ట్రాల్ కనెక్షన్:
కాఫీని అతిగా తాగడం వల్ల శరీరంలో సీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయని అధ్యయనాల్లో రుజువైంది. అయితే ఇలాంటి సమస్యలు అతిగా కాఫీ తాగేవారిలోనే వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలా మంది పురుషుల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడాని అతిగా కాఫీ తాగడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాఫీ గింజలలో ఉండే ఫాస్ట్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచడానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పటికే కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు కాఫీని తీసుకోకపోవడం చాలా మంచిది.
ఏ కాఫీ హానికరం:
ది ఇన్స్టిట్యూట్ ఫర్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ కాఫీ (ISIC) ప్రకారం.. కాఫీలో కనిపించే డైటర్పెన్ కొలెస్ట్రాల్ స్థాయి పెంచడానికి కారణయమవుతుంది. 2011 అధ్యయనం ప్రకారం.. స్కాండినేవియన్ ఉడికించిన కాఫీ, ఫ్రెంచ్ ప్రెస్ కాఫీ, టర్కిష్ కాఫీలు తక్కువగా తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఫిల్టర్ కాఫీ, ఇన్‌స్టంట్ కాఫీలను తీసుకోవాల్సి ఉంటుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించే మార్గాలు:
>>ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి.
>>రోజూ 30-45 నిమిషాలు వ్యాయామం చేయండి.
>>ఎక్కువసేపు కూర్చోకుండా ఉండండి.
>>ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని తినండి.
>>ఎక్కువ కాఫీ తాగవద్దు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Mahesh Fans in Tension:త్రివిక్రమ్ దెబ్బకు టెన్షన్లో మహేష్ ఫాన్స్.. రెండు పడవల ప్రయాణం అవసరమా?
Also Read: Taraka Ratna Health Update: తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్.. ఇప్పుడు ఎలా ఉందంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook