home remedies for cold: సాధారణంగా మనలో చాలామంది చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ  జలుబు కారణంగా విపరీతంగా ముక్కు కారడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గొంతు కరగరా వంటి సమస్యలు కలుగుతాయి.
అయితే ఈ సమస్యల నుంచి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచడంలో కొన్ని ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జలుబుతో ఇబ్బంది పడుతున్ననప్పు మీరు కేవలం ఈ ఐదు సూచనలు పాటిస్తే వెంటనే సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ముందుగా ఎల్లప్పుడు  చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు చేతులని బాగా శుభ్రం చేసుకోవాలి.  చేతుల్లో ఎన్నో రకాల క్రిములు దాగి ఉంటాయి. వీటి కారణంగా కూడా జలుబు సమస్యలు కలుగుతాయి. దీంతో పాటు ప్రతిరోజు మూడు పూటల సాన్నం చేయడం వల్ల శరీరం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటుంది. 


ఎండాకాలంలో  శరీరం డిహైడ్రేషన్ సమస్య బారిన పడుతుంది. కాబట్టి మీరు శరీరానికి కావాల్సిన నీరుని తీసుకోవడం వల్ల  బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే శరీరంలో ఉండే మలినాలు, టాక్సిక్ లు తొలిగిపోతాయి. జులుబు సమస్య ఉన్నప్పుడు మీరు జింక్, విటమిన్ డి, వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ జలుబు వ్యాధులు త్వరగా మాయం అవుతాయి. దీంతో పాటు 7 నుంచి 8 గంటల నిద్రపోవడం చాలా అవసరం. నిద్ర సరిగ్గా లేని కారణంగా కూడూ అనారోగ్య సమస్యలు కలుగుతాయి. 


వీటితో పాటు మీరు వాకింగ్, జిమ్, యోగా వంటివి చేయడం వల్ల  శరీరం యాక్టివ్ గా తయారు అవుతుంది. జలుబుఅనేక అలర్జీ సమస్యలు తరుచుగా కలుగుతున్నప్పుడు మీరు పోషకరమైన  ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మీరు శరీరానికి కావాల్సిన నీరు తీసుకోవడం చాలా మంచిది. 


జలుబు ఒక వైరల్ ఇన్ఫెక్షన్, కాబట్టి మీ శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి  సమయం ఇవ్వడం ముఖ్యం. జాబ్‌ లేదా పాఠశాల నుంచి విరామం తీసుకోండి వల్ల శరీరం విశ్రాంతి పొందుతుంది. డీహైడ్రేషన్‌ను నివారించడంలో శ్లేష్మం పలుచబడటంలో కొన్ని డ్రింక్స్‌ సహాయపడుతాయి.  నీరు,  గోరువెచ్చని నీరు, నిమ్మరసం వంటి స్పష్టమైన జ్యూస్‌లను తీసుకోవడం చాలా మంచిది. మీరు తీవ్రమైన జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వైద్యుడినికి సంప్రదించండి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి