White Hair Problem: ప్రస్తుతం అందర్నీ వేధించే ప్రధాన సమస్య జుట్టు తెల్లబడిపోతుండటం. వయస్సుతో సంబంధం లేకుండా వెంటాడుతోంది. ఆ ఒక్కటి నియంత్రించుకుంటే తిరిగి జుట్టు నల్లబడుతుందంటున్నారు వైద్య నిపుణులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొన్ని రకాల అనారోగ్య సమస్యలే కాదు..జుట్టు తెల్లబడటం కూడా ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా వస్తోంది. ఒకప్పుడైతే అనారోగ్యమైనా లేదా జుట్టు తెల్లబడటమైనా 50 ఏళ్ల తరువాతే ఉండేది. ఇప్పుడలా లేదు. సరైన కారణాలేంటో తెలుసుకునేందుకు ఇప్పటికీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. జట్టు నల్లబడాలంటే ప్రధానంగా కావల్సింది మెలనిన్. జుట్టుకు రంగునిచ్చేది ఇదే. మెలనిన్‌ను వర్ణద్రవ్యమని కూడా పిలుస్తారు. మెలనిన్ లోపంతోనే జుట్టు తెల్లగా అవుతుంది. మెలనిన్ ఎందుకు తగ్గుతుంది..తిరిగి ఉత్పత్తి కావాలంటే ఏం చేయాలనే విషయంపై తాజా పరిశోధనలో ఆసక్తికర అంశాలున్నాయి.


మెలనిన్‌ను ఉత్పత్తి చేసేవి మెలనోసైట్స్ అనే కణాలు. ఇవి జుట్టు మూలభాగాల్లో ఉంటాయి.మెలనిన్ కారణంగానే జుట్టు నల్లగా ఉంటుంది. మెలనోసైట్స్ కణాల వయస్సు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అంటే వయస్సు మీరినవారిలో కన్పిస్తుంటుంది. అయితే ప్రస్తుతం యువతలో కూడా ఇదే సమస్య వెంటాడుతోంది. దీనిపై పరిశోధన చేసినప్పుడు ముఖ్యమైన అంశాలు వెలుగు చూశాయి. శరీరంలో పోషకాల కొరత, అనారోగ్యం, ఒత్తిడి కారణంగా మెలనిన్ ఉత్పత్తి తగ్గి..జుట్టు తెల్లబడిపోతుంటుంది. న్యూయార్క్ కొలంబియా యూనివర్శిటీ పరిశోధకులు  ఈ పరిశోధన చేశారు. ప్రధానంగా ఒత్తిడి కారణంగానే తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లబడిపోతోంది. ఈ విషయంలో అధ్యయనం కూడా ప్రారంభమైంది. అధ్యయనం సమయంలో ప్రజలు ఒత్తిడికి గురికావడం వల్ల జుట్టు తెల్లగా మారుతుందని తేలింది. కొన్ని రకాల వ్యాయామాల ద్వారా ఒత్తిడి దూరమైనప్పుడు తిరిగి మెలనిన్ ఉత్పత్తి ప్రారంభమై..జుట్టు నల్లబడటం అధ్యయనంలో గమనించారు. అంటే మనం ఒత్తిడిని దూరం చేసుకుంటే తెల్లబడిన జుట్టు (White Hair)..తిరిగి నల్లబడుతుందన్న మాట.


Also read: Housing Loan: హౌసింగ్ లోన్ కోసం చూస్తున్నారా..ఏ డాక్యుమెంట్లు అవసరమో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook