Strawberry Detox Water: స్ట్రాబెర్రీ డిటాక్స్ వాటర్‌తో మలబద్ధకం, ఉబ్బరం సమస్యలకు 1 రోజులోనే చెక్!
Strawberry Detox Water For Constipation, Acidity: ప్రతి రోజు స్ట్రాబెర్రీ డిటాక్స్ వాటర్ తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ వాటర్‌ను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. అయితే దీనిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Strawberry Detox Water For Constipation, Acidity: అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే శరీరంలోకి టాక్సిన్స్ పేరుకుపోతాయి. ఇలా పేరుకుపోవడం వల్ల గుండె సమస్యలో పాటు మధుమేహం వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరం నుంచి విష పదార్థాలు తొలగిపోతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరానికి తగినన్ని పోషకాలను అందిస్తాయి. అయితే పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఎలాంటి డిటాక్స్ డ్రింక్ తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
✿ 5 పెద్ద స్ట్రాబెర్రీలు, సన్నగా తరిగినవి
✿ ఒక నారింజ, ముక్కలుగా కోసినవి
✿ 6 పుదీనా ఆకులు, చిన్న ముక్కలుగా చేసినవి
✿ 1.5 లీటర్ల వాటర్
తయారీ విధానం:
✿ ఒక పెద్ద గ్లాస్ జగ్‌లో స్ట్రాబెర్రీలు, నారింజ ముక్కలు, పుదీనా ఆకులను వేయండి.
✿ ఈ గ్లాస్ జగ్‌లోనే నీటిని బాగా కాలపాల్సి ఉంటుంది.
✿ జగ్‌పై మూత పెట్టి ఫ్రిజ్‌లో 2-3 గంటల పాటు ఉంచండి.
✿ రుచిని పెంచడానికి, మీరు 1 టేబుల్ స్పూన్ తేనె లేదా చక్కెరను కూడా వేసుకోవచ్చు.
✿ అంతే సులభంగా డిటాక్స్ వాటర్ రెడీ అయినట్లే.
చిట్కాలు:
✿ తాజా పండ్లను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది.
✿ రుచిని మార్చడానికి నిమ్మ, ద్రాక్ష, లేదా ఇతర పండ్లను కూడా వేసుకోవచ్చు.
✿ డిటాక్స్ వాటర్‌ను తప్పకుండా 24 గంటల్లోపు తాగండి.
డిటాక్స్ వాటర్ లాభాలు:
జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
స్ట్రాబెర్రీ డిటాక్స్ వాటర్ రోజు తాగడం వల్ల మలబద్ధకం, ఆమ్లత్వం లేదా ఉబ్బరం వంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఇందులో చియా గింజలను వినియోగించం వల్ల కూడా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీంతో పాటు శరీరం నుంచి చెడు పదార్థాలు కూడా తొలగిపోతాయి.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
స్ట్రాబెర్రీ డిటాక్స్ వాటర్‌లో ఉండే గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుదుంది. అంతేకాకుండా ఇందులో లభించే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అన్ని రకాల చర్మ సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. కాబట్టి చర్మం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది.
రోగనిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది:
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా కాలేయాన్ని నిర్విషీకరణ చేయడానికి కూడా సహాయపడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి