Constipation Home Remedies: శరీరాన్ని ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉండాలి. అయితే జీర్ణ క్రియ సమస్యలు వస్తే శరీరంలో చాలా రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ పాడవడం వల్ల మలబద్ధకం, పొట్ట సమస్యలు సులభంగా వస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ద వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పోట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ కింది చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలబద్ధకం లక్షణాలు ఏమిటి?
మలబద్ధకం కారణంగా చాలా మందిలో గ్యాస్ ఏర్పడటం, వికారం, కడుపు నొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అయితే తరచుగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు రకాల చిట్కాలను కూడా పాటించాల్సి ఉంటుంది.


ఫైబర్ గల ఆహారాలు:
శీతాకాలంలో మలబద్ధకం వంటి పొట్ట సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు మసాలాలు అధికంగా ఉండే ఆహారాలు మానుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.


నీరు తాగడం చాలా ముఖ్యం:
అధికంగా నీరు తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆహారాన్ని జీర్ణం సులభంగా జీర్ణ చేయడానికి నీరు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ అధిక మోతాదులో నీరును తీసుకోవాల్సి ఉంటుంది.


టీ, కాఫీలు తాగడం మానుకోండి:
మీరు రిఫ్రెష్‌గా ఉంచుకోవడానికి,  నిద్ర పోకుండా ఉండడానికి చాలా మంది టీ, కాఫీలను అతిగా తాగుతూ ఉంటారు. అయితే పొట్ట సమస్యలున్నవారు టీ, కాఫీలను అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాఫీ, టీలకు బదులుగా పాలు తాగడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Also Read: Ind Vs SL: సిరీస్‌ విజయంపై భారత్ కన్ను.. ఆ ప్లేయర్‌ను ఆపితేనే..! 


Also Read: India vs Sri Lanka: విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా మధ్య విభేదాలు.. నెట్టింట వీడియో వైరల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి