Remedies for Constipation: మల బద్ధకం అనేది దాదాపు ప్రతి వయస్సు వారికి ఎదురయ్యే సమస్య. మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తగినంత లేకపోయినా, వ్యాయామం చేయకపోయినా లేదా కొన్ని మందుల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమౌతుంది. మల బద్ధకం నుంచి విముక్తి పొందేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కానీ అన్ని ప్రయత్నాలు సఫలం కావు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలబద్ధకం సమస్యను పూర్తిగా నిర్మూలించడం సాధ్యమే. ఇది పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. మల బద్ధకం నుంచి విముక్తి పొందేందుకు కొన్ని రకాల పండ్లు తీసుకుంటే మంచి ఫలితాలు గమనించవచ్చు. ఇవి మలాన్ని మృదువుగా మార్చి సులభంగా బయటకు విసర్జితమయ్యేందుకు దోహదపడతాయి. దీని కోసం ఆరెంజ్, అరటి పండ్లు, ద్రాక్ష, ఆపిల్, బొప్పాయి పండ్లను క్రమం తప్పకుండా రోజూ ఏదో ఒకటి తీసుకోవాలి. 


బొప్పాయిలో ఫైబర్ గణనీయంగా ఉంటుంది. రోజూ పర కడుపున తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా మల బద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మరో అద్భుతమైన ఫ్రూట్ ఆపిల్. ఇందులో ఉండే పేక్టిన్ అనే లిక్విఫైడ్ ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. మలాన్ని మృదువుగా చేసి ప్రేవుల పనితీరు మెరుగుపరచడం చేస్తుంది. 


ఆరెంజ్ లో విటమిన్ సి, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. దీనివల్ల విసర్జన క్రియ సులభమౌతుంది. మల బద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాల్లో ఎదురయ్యే క్రాంప్స్ తగ్గిస్తుంది. ప్రేవుల పనితీరు మెరుగుపరుస్తుంది. మల బద్ధకం సమస్యకు మరో అద్భుతమైన ఫ్రూట్ ద్రాక్ష. ద్రాక్షలో వాటర్ కంటెంట్, ఫైబర్ రెండూ ఎక్కువే. దాంతో మలం మృదువుగా మరి మల బద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. 


Also read: Vitamin B12: విటమిన్ బి12 లోపిస్తే ప్రాణాంతకం కాగలదా, విటమిన్ బి12 ఎందుకు అవసరం



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook