Constipation: ఆధునిక జీవనశైలిలోని ఆహారపు అలవాట్ల కారణంగా మల బద్ధకం కాన్స్టిపేషన్ సమస్య చాలా ఎక్కువైంది. ఈ సమస్యను మందులతో కాకుండా..సహజసిద్ధంగానే నయం చేసుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడం, నీరు తగినంత తీసుకోకపోవడం, చెడు జీవనశైలి కారణంగా మలబద్ధకం సమస్య వెంటాడుతుంటుంది. తినే ఆహారం సరిగ్గా లేకపోతే కడుపులో గ్యాస్, మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. ఫలితంగా కడుపు క్లీన్ కాదు. మలబద్ధకం సమస్య ఉన్నప్పుడు చాలామంది మందుల్ని ఆశ్రయిస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సులభమైన చిట్కాలున్నాయి..


రాత్రి నిద్రపోయే ముందు..


రాత్రి నిద్రించే ముందు త్రిఫల చూర్ణాన్ని నానబెట్టి కాస్సేపు ఉంచాలి. ఆ తరువాత వడకాచి తాగాలి. ఇలా ఒకసారి చేస్తేనే మీ కడుపు క్లీన్ అయిపోతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. దీంతో పాటు నానబెట్టిన ఫ్లెక్స్ సీడ్స్ నీళ్లు తాగి, సీడ్స్ నమిలి తినేయాలి. 


కిస్మిస్ లేదా ఎండుద్రాక్షను కాస్సేపు నానబెట్టి తినడం వల్ల మంచి ఫలితాలుంటాయి. నానబెట్టిన నీళ్లను కూడా తాగేయాలి. మలబద్ధకం సమస్యను దూరం చేసేందుకు పాలలో 2-3 అంజీర్ పండ్లు వేసి ఉడికించాలి. ఆ తరువాత కొద్దిగా చల్లారిన అంజీర్‌తో సహా తినేయాలి. ఇలా చేస్తే కడుపు శుభ్రమౌతుంది. దీంతోపాటు ఒక గ్లాసు నీళ్లలో ఆముదం నూనె కలిపి తీసుకోవడం లేదా ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో 2 స్పూన్స్ అల్లోవెరా జెల్ కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలుంటాయి.


మలబద్ధకం సమస్య అనేది రాత్రి డిన్నర్ కారణంగా ఏర్పడవచ్చు. అందుకే రాత్రి పూట ఎప్పుడూ భోజనం లైట్‌గా ఉండాలి. డిన్నర్‌లో మైదా, జంక్ ఫుడ్ లేదా ప్రోసెస్డ్ ఫుడ్ తినకూడదు. ఇందులో ఫైబర్ లేకపోవడంతో జీర్ణక్రియలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా మలబద్ధకం తలెత్తుతుంది.


అర్ధరాత్రివరకూ మద్యం లేదా సిగరెట్ స్మోకింగ్ మంచిది కాదు. ఎందుకంటే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఫలితంగా మల బద్ధకానికి దారితీస్తుంది. అర్ధరాత్రి టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల కూడా జీర్ణక్రియ దెబ్బతింటుంది. చాలామందికి డైరీ ఉత్పత్తుల కారణంగా మలబద్ధకం సమస్య వస్తుంటుంది. అందుకే రాత్రి వేళ డైరీ ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోకూడదు. ఐరన్, కాల్షియం సప్లిమెంట్స్ కూడా రాత్రిపూట తీసుకోకూడదు. 


Also read: Tulsi Seeds: తులసి ఆకులే కాదు..గింజలతో కూడా రోగాలు మటుమాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook