Constipation Relieving Fruits: ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది దీంతోపాటు సరైన మోతాదులో నీళ్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మలబద్ధకం సమస్య వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడతాయి. అయితే కొన్ని రకాల ఆహారాలు డైట్ లో చేర్చుకోవడం వల్ల మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా ఫైబర్‌ పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు ఉంటాయి. వీటిని డైట్‌లో చేర్చుకుంటే సరిపోతుంది. అంతేకాదు సరైన లైఫ్‌స్టైల్‌ పాటించకపోవడం కూడా మరో కారణం. వేయించిన, ప్రాసెస్‌ చేసిన ఆహారాలు అతిక తినడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. అంతేకాదు, వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, మలబద్దకం సమస్యకు చెక్‌ పెట్టే ఆ పండ్ల జాబితా తెలుసుకుందాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యాపిల్..
యాపిల్ పండులో ఫ్రీ బయోటిక్ లా పెక్టిన్ పనిచేస్తుంది. ఇది పేగు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు ఆపిల్ పండ్లను తినాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఇతర కడుపు సమస్యలను కూడా  దరిచేరనివ్వకుండా కాపాడుతుంది.


కివి పండు..
కివి పండ్లను తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీర్ఘకాలిక మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు తినడం వల్ల సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఇమ్యూనిటీ పెంచే గుణాలు కూడా ఉంటాయి. ఇందులో యాక్టివిటీన్ అనే ఎంజైమ్ ఉంటుంది ఇది జీర్ణాశయానికి మేలు చేస్తుంది.


అరటిపండు..
అరటి పండ్లు బాగా పండినవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తే ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో పొటాషియం కూడా ఉండటం వల్ల అరటిపండును తినాలని డాక్టర్లు సిఫార్సు చేస్తారు పిల్లలు పెద్దలు అందరికీ ఆరోగ్యకరం. తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి. పండిన అరటిపండులో స్టార్చ్ కూడా ఉంటుంది. దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు అరటిపండు కూడా ఎఫెక్టివ్ రెమిడి.


ఇదీ చదవండి:  రైతులకు బిగ్ అలెర్ట్.. ఈ లిస్టులో మీ పేరు ఉంటే.. పీఎం కిసాన్ డబ్బులు రావు..! పూర్తి వివరాలు ఇవే..  


బొప్పాయి..
బొప్పాయిలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది కడుపులో అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. ఆ పేగు కదలికలను మార్గం సుగమం చేస్తుంది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తుంది ఇందులో పాప్పెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అంతేకాదు ఇది ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


పీయర్‌..
పియర్ పండు లో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇందులో మాయిశ్చర్ గుణాలు ఉంటాయి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. పీయర్ పండు డయాబెటిస్ వారు కూడా మేలు చేస్తుంది. ఇందులో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అయితే పీయర్ పండును డైట్ లో చేర్చుకుంటే మలబద్ధకం సమస్య ఎక్కువ సమర్థవంతమైన రెమెడీ. దీంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.


ఇదీ చదవండి:  ఈ 10 ఆహారాలతో నిత్య యవ్వనం..  ముఖంపై ఒక్క మచ్చ, గీత కూడా కనిపించడం కష్టం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.