Copper vessel water: ఆధునిక జీవనశైలి కారణంగా, ఆహారాలు అతిగా తినడం కారణంగా చాలా మందిలో కడుపు నొప్పి సమస్యల పెరుగుతున్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా రాగి పాత్రలో నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి కఫ, వాత, పిత్త సమస్యలు దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయుర్వేద శాస్త్రంలో రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని చార్జ్డ్ వాటర్ అంటారు. రాగి పాత్రలతో నీటిని 6 నుంచి 7 గంటల పాటు ఉంచగా రాగిలోని లక్షణాలు నీటిలోకి వస్తాయి. దీంతో మీరు ఉదయం పూట ఈ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?


ఉదయాన్నే రాగి పాత్రలో నీటిని ప్రతి రోజూ తాగడం వల్ల పొట్టలోని ప్రేగుల్లో పేరుకుపోయిన మురికి దూరమవుతుంది. అంతేకాకుండా గ్యాస్-ఎసిడిటీతో పాటు పొట్టకు సంబంధించిన చాలా రకాల సమస్యలు సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా అల్సర్ సమస్యతో బాధపడేవారు ఈ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఉపశమనం పొందొచ్చు.


రక్తాన్ని శుద్ధి చేసేందుకు కూడా రాగి పాత్ర నీరు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీటిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి సులభంగా రక్తాన్ని శుద్ధి చేసి, ఆర్థరైటిస్ సమస్యను నివారిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు చర్మ సంబంధింత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.


ఇది తప్పకుండా గుర్తుంచుకోండి:
వేసవిలో రోజంతా రాగి పాత్రలో నిల్వ చేసిన నీటిని అస్సలు తాగొద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కిడ్నీ లేదా గుండె సమస్యలతో బాధపడున్నవారు కూడా తాగడం మంచిది కాదు.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook