Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 19, 2023, 09:32 AM IST
 Guru Gochar 2023: బృహస్పతి గ్రహం మేష రాశిలోకి సంచారం, ఈ రాశులవారు ధనవంతులవుతారా, నష్టపోతారా?

Guru Gochar 2023: ఏప్రిల్ 22 రోజున గురువు బృహస్పతి మీనరాశి  నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతోంది. బృహస్పతి మేషరాశిలోకి సంచారం చేసే క్రమంలో తిరోగమన స్థితిలో ఉండబోతోంది. అయితే ఈ స్థితి ఏప్రిల్‌ 27 వరకు కొనసాగే అవశాలున్నాయి. ఈ తిరోగమన ప్రభావం కారణంగా సూర్యుడు, బుధుడు, రాహువు గ్రహాలు కల్వబోతున్నాయి. ఇలా మొత్తం 5 రాశులు కలయికల వల్ల చాలా రాశులవారిపై ప్రభావం పడే అవకాశాలున్నాయని నిపుపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో గురు, రాహువుల కలయిక జరగబోతోంది. కాబట్టి గురు చండాల యోగం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జాతకంలో బృహస్పతి స్థానం బలంగా ఉంటే చాలా రకాల లాభాలు కలుగుతాయి. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారికి మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశిపై బృహస్పతి సంచార ప్రభావం:
బృహస్పతి లగ్న గృహంలో ఈ సంచారం జరగబోతోంది. కాబట్టి ఈ క్రమంలో మేషరాశివారిపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. జీవితంలోని చాలా రంగాలలో శుభ ఫలితాలు లభిస్తాయి. తల్లిదండ్రుల సహాయంతో అనేక పనులు పూర్తవుతాయి. విద్యార్థులు విద్యారంగంలో మంచి విజయాన్ని పొందుతారు.  ప్రభుత్వ పనులు చేసేవారు ఈ క్రమంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చాలా మంచి ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితంలో కొనసాగుతున్న అడ్డంకులు ఈ సంచారం కారణంగా దూరమవుతాయి. ఈ క్రమంలో తోబుట్టువులతో సంబంధం కూడా బలపడుతుంది. ఉద్యోగస్తుల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

సింహరాశిపై ప్రభావం:
బృహస్పతి సంచారం  సింహరాశికి శుభ ఫలితాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వీరు మతపరమైన ప్రదేశాలకు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కెరీర్‌లో మంచి విజయాన్ని పొందుతారు. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అయితే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారికి చాలా ఈ క్రమంలో భారీ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా విద్యార్థులకు విద్యారంగంలో ఎదురైన ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ క్రమంలో ఉపశమనం లభిస్తుంది.

Also read: Akshaya Tritiya 2023: ఏప్రిల్ 22న ఏర్పడనున్న పంచాగ్రహి యోగంతో ఆ 5 రాశులకు తిరగనున్న దశ

కన్య రాశి:
బృహస్పతి సంచారం వల్ల కన్య రాశివారికి చాలా రకాల మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో విజయాలు సాధిస్తారు. భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. జాగ్రత్తలు తీసుకుని పనులు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు, లాభాలు కలుగుతాయి. తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. కోర్టుకు సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు. జీవితంలోని అన్ని రంగాలలో ముందుంటారు.

తులారాశి:
బృహస్పతి సంచారం వల్ల తులారాశివారికి శుభప్రదంగా మారబోతోంది. ఈ సంచార క్రమంలో తప్పకుండా ఇష్ట దైవానికి పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువు కోవాలనుకునేవారికి కోరికలు నెరవేరుతాయి. అంతేకాకుండా మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆస్తి లేదా వాహనాలు కొనుగోలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా సులభంగా మంచి ఫలితాలు కలుగుతాయి.

Also read: Akshaya Tritiya 2023: ఏప్రిల్ 22న ఏర్పడనున్న పంచాగ్రహి యోగంతో ఆ 5 రాశులకు తిరగనున్న దశ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News