Coriander Seeds Water Benefits: కొత్తి మీర గింజలతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా..?
Coriander Seeds Water Benefits: ప్రతి ఒక్కరి ఇంట్లో రోజూ వంటకాల్లో కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తి మీర లేని వంటకాలన్ని అసంపూర్ణంగా ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా మంది దీనిని దాల్ తడ్కాలో కూడా ఉపయోగిస్తారు. ఇది వంటకాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది.
Coriander Seeds Water Benefits: ప్రతి ఒక్కరి ఇంట్లో రోజూ వంటకాల్లో కొత్తిమీరను ఉపయోగిస్తారు. కొత్తి మీర లేని వంటకాలన్ని అసంపూర్ణంగా ఉంటాయని పెద్దలు చెబుతూ ఉంటారు. చాలా మంది దీనిని దాల్ తడ్కాలో కూడా ఉపయోగిస్తారు. ఇది వంటకాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కొత్తిమీర వంటకాల రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను ఇస్తుంది. కొత్తిమీర ఆకులే కాకుండా కొత్తిమీర గింజలు కూడా శరీరానికి చాలా మేలు చేస్తాయి.
ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి మాత్రమే కాకుండా, రోజువారీ ఆహారంలో ఉపయోగించే కొత్తిమీరలో అనేక పోషకాలు కూడా ఉన్నాయి. చాలా మంది కొత్తిమీర గింజలను హెర్బల్ టీ, డికాక్షన్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఈ గింజలతో చేసిన హెర్బల్ టీని రోజూ అలవాటుగా తాగితే.. అది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. కొత్తిమీర గింజలలో శరీరానికి కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం:
- జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉన్న వ్యక్తులు కొత్తిమీర గింజలతో చేసిన టీని తాగితే..కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
-వేసవిలో కొత్తిమీర గింజలను నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే, ఇది శరీరాన్ని రోజంతా తాజాదనంగా ఉంచుతుంది.
-కీళ్ల నొప్పులు ఉన్నవారు క్రమం తప్పకుండా కొత్తిమీరతో చేసిన టీని తాగాలి. ఇది నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.
-కొత్తిమీర గింజలు నానబెట్టిన నీరు శరీరంలో జీవక్రియను మొరుగుపర్చుతుంది.
-ఇది బరువు తగ్గించడానికి కూడి సహాయపడుతుంది.
- ఈ గింజలతో నానబెట్టిన నీరు తాగడం వల్ల చర్మాన్ని మెరుగుర్చుతుంది.
-ఇది జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి జుట్టును బలంగా చేస్తుంది.
-ప్రతిరోజూ కొత్తిమీర గింజల నీరు తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
-కొత్తిమీర గింజలలో ఉండే లక్షణాలు పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులను నియంత్రించడంలో సహాయపడతాయి.
-ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: Benefits Of Mulberry: వేసవిలో మల్బరీని రోజూ తింటే ఈ సమస్యలు తొలగిపోతాయి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి