Benefits Of Mulberry: వేసవిలో మల్బరీని రోజూ తింటే ఈ సమస్యలు తొలగిపోతాయి..!!

Benefits Of Mulberry: వేసవి కాలంలో లభించే పండ్లలో మల్బరీ ఒకటి. ఇది పుల్లని, తీపి రుచిని కలిగి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మల్బరీ పండ్లు మొదట చైనాలో మొదలై ప్రపంచ వ్యాప్తంగా చేరాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 27, 2022, 04:34 PM IST
  • వేసవిలో మల్బరీని రోజూ తింటే మహిళలకు ఎంతో మేలు
  • స్త్రీలలో ఐరన్ లోపం తొలగిపోతుంది
  • ఎముకలను దృఢంగా చేస్తుంది
Benefits Of Mulberry: వేసవిలో మల్బరీని రోజూ తింటే ఈ సమస్యలు తొలగిపోతాయి..!!

Benefits Of Mulberry: వేసవి కాలంలో లభించే పండ్లలో మల్బరీ ఒకటి. ఇది పుల్లని, తీపి రుచిని కలిగి ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మల్బరీ పండ్లు మొదట చైనాలో మొదలై ప్రపంచ వ్యాప్తంగా చేరాయి. ప్రస్తుతం మార్కెట్‌లో దీని విక్రయాలు అధికంగా పెరిగాయి. కావున ఈ పండ్లకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ పెరిగింది. ఇది ప్రస్తుతం మార్కెట్‌లో మూడు రంగుల్లో(నలుపు, నీలం, ఎరుపు) లభ్యమవుతుంది.  

మల్బరీ రుచినే కాదు శరీరానికి చాలా పోషక విలువలను అందజేస్తుంది. ఇందులో విటమిన్లు, పొటాషియం, ఐరన్, కాల్షియం మొదలైనవి ఉంటాయి. ఈ మల్బరీ వల్ల మహిళలకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీని ద్వారా స్త్రీలకు కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

మల్బరీ తినడం వల్ల స్త్రీలకు కలిగే ప్రయోజనాలు:

స్త్రీలలో ఐరన్ లోపం:

తరచుగా స్త్రీలు ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఈ  ఐరన్ లోపం వల్ల రక్తహీనత సమస్యలు ఏర్పాడతాయి. ఈ సమస్యలు ఎక్కువగా గర్భధారణ సమయంలో మొదలవుతుంది. ఈ పరిస్థితులలో మల్బరీ పండ్లను తీసుకోవడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఐరన్ పరిమాణం ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనతను తగ్గిస్తుంది.

ఎముకలను దృఢంగా చేస్తుంది:

30 సంవత్సరాల వయస్సు తర్వాత మహిళల్లో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మల్బరీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వాన్ని పెంచి, కీళ్ల నొప్పులను తొలగించడానికి సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ల అధికంగా ఉన్నందున ఎముకలు, కండరాలపై ప్రభావం చూపుతుంది.

బరువు తగ్గిస్తుంది:

మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది మహిళలు బరువు పెరుగుతున్నారు. బరువుని తగ్గించుకోవడానికి వ్యాయామం, డైటింగ్ వంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇవి శరీర బరువుపై అంతగా ప్రభావం చూపడం లేదు. మల్బరీలో ఫైబర్ పుష్కలంగా ఉండడం వల్ల బరువును సులభంగా తగ్గిస్తుంది.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

 

Also Read: Honey Facial At Home: హనీ ఫేషియల్‌తో తక్షణమే ముఖానికి గ్లో..చర్మానికి చాలా ప్రయోజనాలు..!!

Also Read: Giloy Benefits: తిప్ప బెరడు వల్ల చర్మానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News