Corona New Variant: భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్, పేరేంటో తెలుసా
Corona New Variant: కోవిడ్ మరోసారి భయపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ యూకే నుంచి వ్యాపిస్తూ ఆందోళన రేపుతోంది. కరోనా మహమ్మారి ముప్పు పోయిందని ఊపిరి పీల్చుకునే క్రమంలో కొత్తగా మరో వేరియంట్ పుట్టుకురావడం కలకలం రేపుతోంది.
Corona New Variant: కోవిడ్ మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉందా అంటే అవుననే సమాధానం విన్పిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ రూపం భయభ్రాంతుల్ని చేస్తోంది. యూకే నుంచి వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌కు ఎరిస్ అని పిలుస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూ ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్‌కు మరో కొత్త వేరియంట్ ఎరిస్ పుట్టుకొచ్చింది. ఇంగ్లండ్ నుంచి వ్యాప్తి చెందుతున్న ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంగ్లండ్ వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కొత్త వేరియంట్ ఎరిక్ ప్రతి 7 కేసుల్లో ఒకటిగా వెలుగు చూస్తోందని ఇంగ్లండ్ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 4,396 శ్వాసకోశ నమూనాల్లో 5.4 శాతం కోవిడ్ 19 కేసులుగా గుర్తించారు. జూలైలో ఎరిస్ కేసులు 11.8 శాతంగా ఉన్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎరిస్ తొలి కేసు హోరిజోన్ స్కానింగ్‌లో జూలై 3వ తేదీన బయటపడింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కరోనాకు సంబంధించి ఇప్పటి వరకూ 4,722 సీక్వెన్సులు వెలుగు చూశాయి. ఇందులో చాలావరకూ తీవ్రత లేనివే. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ..హెల్త్ ఎమర్జెన్సీ జాబితా నుంచి కోవిడ్ 19 ను మే 5వ తేదీన తొలగించింది. ఆ తరువాత ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎరిస్ ఆందోళన రేపుతోంది. లక్షణాలు పూర్తిగా తెలియనప్పటికీ ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని తెలుస్తోంది. శ్వాసకోశ సంబంధిత సమస్య మాత్రం ఈ వేరియంట్ సోకిన వారిలో తీవ్రంగా ఉంటోందని తెలుస్తోంది.
వాతావరణం పూర్తిగా కలుషితం కావడంతో పాటు మనుషుల్లో రోగ నిరోధక శక్తి మందగించడం ఈ వ్యాధి పెరుగుదలకు కారణంగా వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి తరువాత ప్రజలు చాలా వరకూ రిలాక్స్ అయిపోయి..నిబంధనలు, హెల్త్ కేర్ అన్నీ గాలికొదిలేసినట్టు అర్ధమౌతోంది.
Also read: Weight Loss Tips: నిమ్మ తొక్క రసంతో కూడా వేగంగా బరువు తగ్గొచ్చు.. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook