Corona New Variant: కోవిడ్ 190 కొత్త వేరియంట్ ఇప్పుడు భయం గొలుపుతోంది. ప్రపంచంలో కరోనా ముప్పు ముగిసిపోయిందనుకుని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో కొత్తగా మళ్లీ భయం వ్యాపిస్తోంది. యూరప్ దేశాల్ని ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ భయపెడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019లో చైనా నుంచి ప్రారంభమైన కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని గజగజలాడించింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మరోసారి కరోనా వైరస్ భయపెడుతోంది. కోవిడ్ 19 కొత్త వేరియంట్ ఈజీ 5.1 లేదా ఎరిస్‌గా నామకరణం పొందిన ఈ వైరస్ ఇప్పటికే యూరప్ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ముందుగా బ్రిటన్‌లో వెలుగుచూసిన ఈ వేరియంట్..అన్ని దేశాల్లో ఆందోళన కల్గిస్తోంది. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ నుంచి వచ్చిందని తెలుస్తోంది. బ్రిటన్ హెల్త్ ఏజెన్సీల ప్రకారం జూలై 3వ తేదీన ఎరిస్ తొలిసారి అంతర్జాతీయంగా కోవిడ్ కొత్త వేరియంట్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం దీనిపై ఫోకస్ పెడుతోంది. 


ఈ కొత్త వేరియంట్ వేగంగా అయితే వ్యాపిస్తోంది కానీ ఎంతవరకూ ప్రమాదకరమనేది ఇంకా స్పష్టత లేదు.  7 కొత్త కరోనా వేరియంట్లలో ఇదొకటి. సేకరించిన 4 వేల శాంపిల్స్‌లో 5.4 శాతం కోవిడ్ 19 గా తేలాయి. బ్రిటన్‌లో ప్రతి 7 కరోనా కేసుల్లో ఒకరికి ఎరిస్ వేరియంట్ లక్షణాలు కన్పిస్తున్నాయి. ఈ కొత్త వేరియంట్ ముప్పు అన్ని వయస్సులవారికి ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా వృద్ధులపై మరింత ఎక్కువగా ఉండనుంది. వృద్ధులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని తెలుస్తోంది. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకుంటూ పరిశుభ్రత పాటిస్తే కోవిడ్ 19 నుంచి కాపాడుకోవచ్చు. మీకు ఒకవేళ శ్వాస సంబంధిత సమస్య ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో దూరం పాటించాలి.


ఇప్పుడీ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా కొత్త వేరియంట్ ఎరిస్‌కు ముఖ్య కారణాలేంటనేది ఇంకా తెలియలేదు. చెడు వాతావరణం, బలహీనమైన రోగ నిరోధక శక్తి కారణం కావచ్చని అంచనా. ప్రపంచంలో మరోసారి సినిమా థియేటర్లు, బహిరంగ ప్రదేశాల్లో జన సందోహం పెరిగిపోవడం వల్ల ఈ పరిస్థితి ఎదురౌందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


ముక్కు కారడం, తలనొప్పి, అలసట, తుమ్ములు రావడం, గొంతు పాడవడం కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ లక్షణాలుగా ఉన్నాయి.ఈ వేరియంట్ నుంచి కాపాడుకోవాలంటే స్వచ్ఛత పాటించడం, లక్షణాలు కన్పించగానే ఇతరులతో దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతానికి పరిష్కారం. ఎరిస్ వేరియంట్‌పై పూర్తి స్పష్టత వచ్చేందుకు మరి కొంత సమయం పట్టవచ్చు.


Also read: Skin Care Mistakes: మీ చర్మానికి హాని కల్గించే 5 తప్పులు ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook